Cracked Heels: శీతాకాలంలో మడమల పగుళ్ల సమస్యకు బెస్ట్ హోమ్ రెమిడీస్ ఇవే!

| Edited By: Janardhan Veluru

Dec 12, 2023 | 3:11 PM

శీతా కాలంలో వచ్చే చర్మ సమస్యల్లో మడమల పగుళ్ల సమస్య కూడా ఒకటి. చలి కారణంగా పాదాలకు పగుళ్లు వస్తూ ఉంటాయి. ఈ పగుళ్ల కారణంగా పాదాల్లలో మంటలు, నొప్పులు విపరీతంగా వస్తూ ఉంటాయి. దీంతో నడవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కువ సేపు నిల్చోలేరు. ఈ పగుళ్ల కారణంగా కొంత మందిలో వాపు కూడా వచ్చేస్తుంది. వీటికి ముందుగానే చికిత్స అందించకపోతే.. దీర్ఘకాలిక సమస్యలు ఎదురయ్యే సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లోనే ఉండే కొన్ని..

Cracked Heels: శీతాకాలంలో మడమల పగుళ్ల సమస్యకు బెస్ట్ హోమ్ రెమిడీస్ ఇవే!
Cracked Heels
Follow us on

శీతా కాలంలో వచ్చే చర్మ సమస్యల్లో మడమల పగుళ్ల సమస్య కూడా ఒకటి. చలి కారణంగా చాలా మందికి పాదాలకు పగుళ్లు వస్తుంటాయి. ఈ పగుళ్ల కారణంగా పాదాల్లలో మంటలు, నొప్పులు విపరీతంగా వస్తూ ఉంటాయి. దీంతో నడవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కువ సేపు నిల్చోలేరు. ఈ పగుళ్ల కారణంగా కొంత మందిలో వాపు కూడా వచ్చేస్తుంది. వీటికి ముందుగానే చికిత్స అందించకపోతే.. దీర్ఘకాలిక సమస్యలు ఎదురయ్యే సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లోనే ఉండే కొన్ని రకాల పదార్థాలను ఉపయోగించి ఈ పగళ్ల సమస్యల నుంచి ఈజీగా ఉపశమనం పొందవచ్చు. శీతా కాలంలో వచ్చే పగుళ్ల సమస్యకు చెక్ పెట్టేలా ఇంట్లోనే హోమ్ మేడ్ హీల్ క్రాక్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు. మరి ఈ క్రీమ్ ని ఎలా తయారు చేసుకుంటారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

హోమ్ మేడ్ హీల్ క్రాక్ క్రీమ్ కి కావాల్సిన పదార్థాలు:

ఆవాల నూనె – 2 స్పూన్లు, కొబ్బరి నూనె – 2 స్పూన్లు, వాసెలీన్, విటమిన్ ఇ క్యాప్సూల్స్ – ఒక స్పూన్, కర్పూరం – అర టీ స్పూన్.

హోమ్ మేడ్ హీల్ క్రాక్ క్రీమ్ తయారీ విధానం:

ఒక చిన్న పాత్ర తీసుకుని అందులో పైన చెప్పిన క్వాంటిటీ ప్రకారం కోకోనెట్ ఆయిల్, ఆవాల నూనె తీసుకోవాలి. ఈ రెండింటినీ బాగా కలుపు కోవాలి. ఇందులోనే కర్పూరం కూడా వేసి మెత్తగా అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిశ్రమంలో వాసెలీన్, విటమిన్ ఇ క్యాప్సూల్స్ కూడా కలిపి పక్కన పెట్టుకోవాలి.

ఇవి కూడా చదవండి

వీటన్నింటినీ బాగా కలుపుకుని.. ఈ క్రీమ్ ని డబుల్ బాయిలింగ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్ల బడ్డాక.. మడమలకు రాసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని గాజు సీసాలో నింపుకుని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవచ్చు. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు రాసుకుంటే మడమల పగుళ్లు వారం రోజుల్లో తగ్గి పోతాయి. మడమల నొప్పులు, వాపులు కూడా తగ్గుముఖం పడతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.