ప్రతి రోజు గ్లాసు పాలు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అందరికి తెలిసిన విషయమే. పాలలో అనేక పోషకాలుంటాయి. రోజూ పాలు తాగితే ఎముకలు బలంగా ఉంటాయి. పిల్లలు, పెద్దలు పాలు తాగితే ఆరోగ్యంగా ఉంటారు. అయితే పాలతో కలిపి కొన్ని పదార్థాలను తీసుకుంటే మీరు ప్రమాదంలో పడినట్టే. పాలతో కలిపి ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా మందికి అలవాటు. కానీ కొన్ని సందర్భాల్లో పాలతో పాటు.. ఈ ఆహారాన్ని తీసుకుంటే మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. అవెంటో తెలుసుకుందామా.
పాలు లేదా పెరుగుతో కలిపి చేపలను అస్సలు తీసుకోవద్దు. వీటిని కలిపి తీసుకోవడం వలన అజీర్తి సమస్యలు వస్తాయి. అలాగే చికెన్ కూడా పాలతో కలిపి తీసుకోవద్దు. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వలన గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు కలుగుతాయి. ఇక మినపప్పులో అనేక పోషక పదార్థాలు ఉంటాయి. అయితే వీటిని పాలతో కలిపి తీసుకోవడం వలన వాంతులు, కడుపు బరువెక్కడం వంటి సమస్యలు కలుగుతాయి.
అలాగే పాలు లేదా పెరుగుతో కలిపి సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవద్దు. ద్రాక్ష, నిమ్మకాయ, ఆరెంజ్ వంటి ఆమ్లత్వం కలిగిన పదార్థాలను అస్సలు తీసుకోవద్దు. ఒకవేళ ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వలన కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. పాలు, పెరుగు తిన్న రెండు గంటల తర్వాత నువ్వులు, ఉప్పు పదార్థాలను తీసుకోవాలి. వీటిని కలిపి అస్సలు కలిపి తీసుకోవద్దు. పనస కాయని, కాకరకాయని కూడా పాలు పెరుగుతో కలిపి అస్సలు తీసుకోవద్దు. ఇలా చేస్తే దురదలు, సోరియాసిస్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఎప్పుడు పాలను తాగేప్పుడు వీటిని తీసుకోవద్దు.
డల్ గా పోస్ట్ లు పెడుతున్న షణ్నూ.. ఫీలవుతున్న ఫ్యాన్స్.. చెయ్‌రా చిచ్చా.. మస్తు మజా అంటూ..
Pushpa: పుష్ప సినిమా కాదు ఒక అనుభవం.. బన్నీపై ప్రశంసల వర్షం కురిపించిన అర్జున్ కపూర్..