AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pancreatic Cancer: మహిళలకు పొంచి ఉన్న పెను ముప్పు.. ఈ అలవాట్లతో క్యాన్సర్ ప్రమాదం..

మనం తినే తిండి, చేసే పనులు, పాటించే పద్ధతులు ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా మహిళల్లో వారి అలవాట్లు వారి ప్రాణాలపై కి తీసుకొస్తుందని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ వంటి వి కూడా చుట్టుముడుతున్నాయని హెచ్చరిస్తున్నారు.

Pancreatic Cancer: మహిళలకు పొంచి ఉన్న పెను ముప్పు.. ఈ అలవాట్లతో క్యాన్సర్ ప్రమాదం..
Pancreatic Cancer
Madhu
|

Updated on: Jul 08, 2023 | 6:01 PM

Share

మన అలవాట్లు మనకు ప్రాణ సంకటంగా మారుతున్నాయి. మీరు చదువుతున్నది నిజమేనండి. మనం తినే తిండి, చేసే పనులు, పాటించే పద్ధతులు ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా మహిళల్లో వారి అలవాట్లు వారి ప్రాణాలపై కి తీసుకొస్తుందని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ వంటివి కూడా చుట్టుముడుతున్నాయని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మహిళల్లో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. ఇది కేవలం వారి అలవాట్ల కారణంగానే వ్యాపిస్తోందని వివరిస్తున్నారు.

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటే..

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది ప్యాంక్రియాస్‌లోని కణాలు మ్యుటేషన్‌కు గురై అసాధారణంగా గుణించి, కణితిని ఏర్పరుచుకున్నప్పుడు సంభవించే వ్యాధి. ప్యాంక్రియాస్, ఉదరంలోని గ్రంథి, జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్‌లను, చక్కెరల జీవక్రియను నియంత్రించడంలో సహాయపడే హార్మోన్లను స్రవిస్తుంది. అప్పుడు ఆరోగ్యకరమైన ప్యాంక్రియాటిక్ కణాలు పనిచేయడం మానేస్తాయి. ప్రాణాంతక కణాలు అనియంత్రితంగా పెరుగుతాయి.

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాలు ఇవి..

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను దాని ప్రారంభ దశల్లో గుర్తించడం కష్టమని నిపుణులు చెబుతున్నారు. అయితే శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ ద్వారా చికిత్స చేయవచ్చని వివరిస్తున్నారు. ఇది సోకినప్పుడు సాధారణంగా కామెర్లు, వికారం, వాంతులు, అతిసారం, రక్తహీనత, వాపు, కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం, ఉబ్బరం, అలసట, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి

ఈ అలవాట్లను మార్చుకోవాలి..

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ మహిళల్లో ఎనిమిదవ అత్యంత సాధారణ క్యాన్సర్. ఈ రకమైన క్యాన్సర్ వివిధ ప్రమాద కారకాల వల్ల సంభవించవచ్చు. ఈ ప్రమాద కారకాలు ప్రధానంగా జీవనశైలి అలవాట్లే. ఆ అలవాట్లు ఏంటో చూద్దాం..

ధూమపానం.. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రమాదాన్ని ఈ అలవాటు రెట్టింపు చేస్తుంది. దాదాపు 20-30% ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌లు పొగాకు వినియోగం వల్ల సంభవిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఊబకాయం.. ఇది కూడా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రమాదాన్ని 20% వరకు పెంచుతుంది. అదనపు బరువు ఉన్న వ్యక్తులు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను అభివృద్ధి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మధుమేహం.. డయాబెటిస్ ఉన్న రోగులలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. టైప్ 2 డయాబెటిస్‌లో ఇది సర్వసాధారణం. ఇది పిల్లలు, కౌమారదశలో పెరుగుతున్న ఊబకాయంతో పెరుగుతుంది.

మద్యం.. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కూడా వస్తుంది. ఆల్కహాల్ తీసుకోని వ్యక్తుల కంటే ఆల్కహాల్ తీసుకునే వ్యక్తులకు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ప్రాసెస్ చేసిన మాంసం.. ప్రాసెస్ చేసిన మాంసాన్ని తినడం వల్ల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుందని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి.

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ను ముందుగా గుర్తించలేం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం, 2030 నాటికి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసుల సంఖ్య సంవత్సరానికి 12,000 వరకు పెరగవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..