AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pumpkin Seeds: గుమ్మడికాయ గింజలను పడేస్తున్నారా? ఈ ఆరోగ్య ప్రయోజనాలు మిస్‌ చేసుకున్నట్లే

గుమ్మడికాయల గింజలతోనూ పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ఎండిన గుమ్మడి గింజలను ప్రతిరోజూ తినడం వల్ల ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం తదితర పోషకాలు శరీరానికి తగినంత లభిస్తాయి.

Pumpkin Seeds: గుమ్మడికాయ గింజలను పడేస్తున్నారా? ఈ ఆరోగ్య ప్రయోజనాలు మిస్‌ చేసుకున్నట్లే
Pumpkin Seeds
Basha Shek
|

Updated on: Oct 23, 2022 | 12:46 PM

Share

మన ఆరోగ్యంలో కూరగాయలు కీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే అన్ని కూరగాయలలో ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. ఇక గుమ్మడికాయలో మెగ్నీషియం, కార్బోహైడ్రేట్లు మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యంలో ఎంతో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇక గుమ్మడికాయను అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. వివిధ వంటకాల్లోనే కాకుండా సలాడ్ల రూపంలోనూ తీసుకోవచ్చు. ఇదిలా ఉంటే గుమ్మడికాయల గింజలతోనూ పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ఎండిన గుమ్మడి గింజలను ప్రతిరోజూ తినడం వల్ల ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం తదితర పోషకాలు శరీరానికి తగినంత లభిస్తాయి. వీటికి రోగనిరోధక శక్తిని పెంచే గుణం కూడా ఉంది. అలాగే కొలెస్ట్రాల్ తగ్గుతుందని, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఇవి కాకుండా..

గుమ్మడి కాయ గింజలతో ఆరోగ్య ప్రయోజనాలివే..

  • ఈ విత్తనాలు మీ శరీరాన్ని మధుమేహం నుండి రక్షించడంలో సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. స్పెర్మ్ నాణ్యతను పెంచుతాయి .
  • గుమ్మడికాయ గింజలు గుండె జబ్బులు, అలాగే కొన్ని క్యాన్సర్ల నుండి రక్షిస్తాయని ఇటీవల ఆధారాలు సూచిస్తున్నాయి . ఇందులో తగినంత పోషకాలు ఉంటాయి. వీటితో రోగనిరోధక శక్తి మెరగవుతుంది.
  • ఇందులో మంచి ఫ్యాటీ యాసిడ్స్ , పొటాషియం , విటమిన్ బి2 ఉంటాయి . ఇలాంటి అరుదైన పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి .
  • గుమ్మడి కాయ గింజలు జింక్, ఇనుముతో నిండి ఉంటాయి. ఈ రెండూ మన రోగనిరోధక వ్యవస్థకు అవసరమైన పోషకాలు. అదనంగా
  • గుమ్మడికాయ గింజలు ఈ సూక్ష్మజీవుల నుండి శరీరాన్ని రక్షించే యాంటీ ఫంగల్, యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి .
  • ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడే విటమిన్ E , ఇతర యాంటీఆక్సిడెంట్లు గుమ్మడి కాయ గింజల్లో ఉంటాయి.
  • ఈ రోజుల్లో, పెద్దవారి కంటే యువకులలో గుండెపోటు చాలా సాధారణమైంది. కాబట్టి గుండె ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం . అందువల్ల, మీ ఆహారంలో ప్రతిరోజూ గుమ్మడికాయ గింజలను తీసుకోవడం అలవాటు చేసుకోవాలనుకుంటున్నారు నిపుణులు

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం..  క్లిక్ చేయండి