Thati kallu: తాటికల్లు ఆ సమయంలో తాగితే అద్భుతం.. దాని ప్రయోజనాలు పుష్కలం..!

Thati kallu: గ్రామాల్లో ఉన్నవారు తాటికల్లుని దివ్య ఔషధంగా భావిస్తారు. ఎందుకంటే ఇందులో విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి.

Thati kallu: తాటికల్లు ఆ సమయంలో తాగితే అద్భుతం.. దాని ప్రయోజనాలు పుష్కలం..!
Thati Kallu
Follow us
uppula Raju

|

Updated on: Feb 22, 2022 | 1:09 PM

Thati kallu: గ్రామాల్లో ఉన్నవారు తాటికల్లుని దివ్య ఔషధంగా భావిస్తారు. ఎందుకంటే ఇందులో విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకే పూర్వీకులు తాటిచెట్టుని కల్పవృక్షంగా చెప్పేవారు. ప్రతి ఆరోగ్య సమస్యకి కల్లు ద్వారానే పరిష్కారం వెతుక్కునేవారు. కల్లు ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఎన్నో పరిశోధనల్లో తేలింది. కానీ ఏదైనా అతిగా సేవిస్తే ప్రమాదమే ఈ షరతు తాటికల్లుకి కూడా వర్తిస్తుంది. అయితే తాటికల్లుని ఎప్పుడు తాగాలి. ఏ సమయంలో తాగితే మంచిదో అనేక విషయాలు తెలుసుకుందాం. అప్పుడే చెట్టు నుంచి తీసిన తాటికల్లు తాగితే అందులో ఉన్న ఓ సూక్ష్మజీవి మానవుని కడుపులో ఉన్న క్యాన్సర్‌ కారకాన్ని నాశనం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. చెట్టు నుంచి తీయగానే తాగితే ఈ ఫలితాలు అందుతాయి. కొన్ని గంటలు తర్వాత తాగితే అది పులిసిపోయి ఆల్క్‌హాల్‌గా మారిపోతుంది. దాన్ని తాగితే ఆరోగ్యానికి హానికరం. అందుచేత చెట్టు నుంచి తీసిన కల్లునే తాగాలని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. తాటికల్లు మానవ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు కారణం అయ్యే వైరస్‌కు తాటికల్లు యాంటిబయాటిక్‌గా పనిచేస్తుంది.

నగరాలు, పట్టణాలలో నివసించే ప్రజలు ప్రతిరోజు మసాల ఆహారాలు, జంక్‌ ఫుడ్స్‌ వంటివి తీసుకుంటారు. దీంతో ఉదర సమస్యలతో బాధపడుతారు. అలాంటి వారికి కల్లు ఒక దివ్య ఔషధమని చెప్పవచ్చు. కల్లులో ఉండే గుణాలు కడుపుని క్లీన్ చేస్తాయి. అందుకే చాలామంది ఒక్కసారైనా కల్లు తాగాలని అనుకుంటారు. తాటిచెట్టు ఒక్క కల్లు మాత్రమే కాదు చాలా అవసరాలకి ఉపయోగపడుతుంది. తాటాకులతో గుడిసెలు వేసుకుంటారు. చాపలు, బుట్టలు, సంచులు, విసనకర్రలు, టోపీలు, గొడుగులు తయారు చేసుకుంటారు. తాటిచెట్టు కలప కూడా గట్టిగా ఉంటుంది. ఇల్లు కట్టుకోవడంలో దూలాలుగా, స్తంభాలుగా ఉపయోగపడుతుంది.

Dangers Brushing: ఎక్కువ సేపు బ్రష్ చేస్తున్నారా.. పళ్లతో పాటు వీటికి కూడా ఎఫెక్టే..?

ఆదివారం చేపలు తింటున్నారా.. మటన్ తింటున్నారా.. ఈ విషయాలు తెలిస్తే మీ ఎంపిక మారుతుంది..?

Relationship: కొత్తగా పెళ్లైన జంటలు ఈ 4 విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి.. అవేంటంటే..?