AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆదివారం చేపలు తింటున్నారా.. మటన్ తింటున్నారా.. ఈ విషయాలు తెలిస్తే మీ ఎంపిక మారుతుంది..?

Fish And Mutton: ఆదివారం చాలామందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. అందుకే సామాన్యుల నుంచి ధనవంతుల దాకా కచ్చితంగా నాన్‌ వెజ్‌ తింటారు.

ఆదివారం చేపలు తింటున్నారా.. మటన్ తింటున్నారా.. ఈ విషయాలు తెలిస్తే మీ ఎంపిక మారుతుంది..?
Fish And Mutton
uppula Raju
|

Updated on: Feb 22, 2022 | 11:50 AM

Share

Fish And Mutton: ఆదివారం చాలామందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. అందుకే సామాన్యుల నుంచి ధనవంతుల దాకా కచ్చితంగా నాన్‌ వెజ్‌ తింటారు. నగరాలలో అయితే ఈ అలవాటు మరీ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ రోజు మటన్, చికెన్, చేపలని ఎక్కువగా విక్రయిస్తారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ మీరు తీసుకునే ఆహారం మీ ఆరోగ్యానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది.. ఎప్పుడైనా ఆలోచించారా.. చికెన్ గురించి చాలామందికి తెలిసి ఉంటుంది. కానీ మటన్‌, చేపల గురించి ఈ విషయాలు తెలుసుకోండి. మాంసాహారంలో రెడ్ మీట్, వైట్‌ మీట్‌ అని రెండు రకాలుగా పిలుస్తున్నారు. రెడ్ మీట్ అంటే బీఫ్‌‌‌‌, మటన్, పోర్క్ లాంటివి. వైట్ మీట్ అంటే చేపలు, కోడి, రొయ్యలు, పీతలు, పక్షల మాంసం. అయితే చికెన్‌‌‌‌లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. మటన్‌‌‌‌లో ప్రొటీన్‌‌‌‌తో పాటు ఫ్యాట్స్ కూడా ఉంటాయి. కొవ్వు తినకూడదు, కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనుకునేవాళ్లు.. మటన్‌‌‌‌కి బదులు చికెన్‌‌‌‌ను ఎంచుకుంటారు. అయితే కొలెస్ట్రాల్‌‌‌‌తో సంబంధం లేని వాళ్లు మాత్రం మటన్‌‌‌‌ని ఎంజాయ్‌ చేస్తారు.

అయితే మటన్‌, చికెన్ కంటే చేపలు బెస్‌ అని చెప్పవచ్చు. ఈ రెండింటి కంటే ధర తక్కువ పోషకాలు ఎక్కువ. ఫుడ్స్ ముఖ్యంగా సాల్మన్ చేపలు ఆరోగ్యానికి మరింత ఉత్తమని పరిశోధనలు సూచిస్తున్నాయి. వీటిలో ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రోటీన్, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. మంచి ఆరోగ్యాన్ని పొందడానికి వారానికి రెండు, మూడు సార్లు చేపలు తినవచ్చు. చేపల్లో కొవ్వు పదార్థాలు తక్కువ.. నాణ్యమైన పోషకాలు ఎక్కువగా ఉంటాయి. చేపలను తినడం వల్ల బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటిస్ లాంటివి కంట్రోల్‌లో ఉంటాయి. దీంతోపాటు గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్, మెదడు సంబంధింత సమస్యల నుంచి కూడా గట్టెక్కవచ్చని పేర్కొంటున్నారు. వారానికి రెండు మూడుసార్లు చేపలు తినవచ్చు. కానీ చికెన్‌, మటన్‌ తినడం మాత్రం మంచిది కాదని గుర్తుంచుకోండి.

Relationship: కొత్తగా పెళ్లైన జంటలు ఈ 4 విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి.. అవేంటంటే..?

JIO: జియో ఈ 4 ప్లాన్‌లలో జంబో డేటా ఆఫర్.. ధరలు ఏ విధంగా ఉన్నాయంటే..?

Gas Cylinder: గ్యాస్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఈ సిలిండర్‌ ధర కేవలం రూ. 633 మాత్రమే..?