Relationship: కొత్తగా పెళ్లైన జంటలు ఈ 4 విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి.. అవేంటంటే..?

Relationship: భార్యాభర్తల మధ్య సంబంధం కలకాలం ఉండాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన జంటలు ఈ విషయాలపై దృష్టి

Relationship: కొత్తగా పెళ్లైన జంటలు ఈ 4 విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి.. అవేంటంటే..?
Relationship
Follow us

|

Updated on: Feb 22, 2022 | 11:17 AM

Relationship: భార్యాభర్తల మధ్య సంబంధం కలకాలం ఉండాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన జంటలు ఈ విషయాలపై దృష్టి సారించాలి. ప్రస్తుత జనరేషన్‌లో చిన్న చిన్న గొడవలకే చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు అధికారం చెలాయించుకొని బంధాన్ని విడగొట్టుకుంటున్నారు. అందుకే దంపతులుగా మారేముందు జీవితంలో కొన్ని విషయాలు తెలుసుకోవడం తప్పనిసరి. అలాంటి నాలుగు విషయాల గురించి మాట్లాడుకుందాం.

1. ఒకరిపై ఒకరికి నమ్మకం

భార్యాభర్తలకు ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. దంపతులుగా మారినప్పుడు ఇంట్లో చిన్న చిన్న తగాదాలు ఉంటాయి. కానీ పంతానికి పోయి బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోకూడదు. మనస్పర్థలు వస్తే ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఇది విడాకుల వరకు వెళుతుంది.

2. సమాన హక్కులు

భార్యా భర్తల సంబంధంలో ఇద్దరికి సమాన హక్కులు ఉంటాయి. ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఒకరిని ఒకరు తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మీ భాగస్వామిపై పెత్తనం చెలాయించాలని చూడకూడదు. దంపతుల మధ్య ఒక అన్యోన్యత ఉండాలి. ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం.

3. కోరికలకు విలువ ఇవ్వాలి

ఒకరి కోరికలని ఒకరు గౌరవించాలి. సంబంధం బలపడాలంటే ఇష్టాలకి విలువ ఇవ్వాలి. ఇష్టమైన ఆహారాలు, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవాలి. అప్పుడే ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉంటుందో తెలుస్తుంది. భార్యభర్తల మధ్య అనుబంధం చిగురిస్తుంది.

4. వృత్తి పట్ల గౌరవం

మీ భాగస్వామి ఏ వృత్తిలో ఉన్నా వారిని కచ్చితంగా గౌరవించాలి. వారి కష్టాన్ని గుర్తించాలి. మీ భాగస్వామి తక్కువ సంపాదిస్తున్నా చిన్న చూపు చూడకూడదు. ఇంటిపనులలో ఒకరికొకరు సాయం చేసుకోవాలి. అప్పుడే బంధం బలపడుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా చివరివరకు ఒకరికొకరు తోడుంటారు. కొత్తగా పెళ్లైనవారు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.

JIO: జియో ఈ 4 ప్లాన్‌లలో జంబో డేటా ఆఫర్.. ధరలు ఏ విధంగా ఉన్నాయంటే..?

Gas Cylinder: గ్యాస్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఈ సిలిండర్‌ ధర కేవలం రూ. 633 మాత్రమే..?

Hyderabad: హైదరాబాద్‌లో మరో దారుణం.. పాలకోసం బయటికి వచ్చిన బాలికపై అఘాయిత్యం..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..