JIO: జియో ఈ 4 ప్లాన్‌లలో జంబో డేటా ఆఫర్.. ధరలు ఏ విధంగా ఉన్నాయంటే..?
JIO: ఇంటర్ నెట్ ఎక్కువగా వినియోగించేవారికి ఒక్కోసారి డేటా సరిపోదు. దీంతో వారు మళ్లీ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అలాంటి
JIO: ఇంటర్ నెట్ ఎక్కువగా వినియోగించేవారికి ఒక్కోసారి డేటా సరిపోదు. దీంతో వారు మళ్లీ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అలాంటి వారికి రిలయన్స్ జియో నాలుగు జంబో ప్లాన్‌లని ప్రవేశపెట్టింది. ఇవి సరసమైన ధరలో చాలా ప్రయోజనాలతో వస్తు్న్నాయి. ఓటీటీలు, వీడియో ప్లాట్‌ఫామ్స్ ఎక్కువగా వీక్షించవచ్చు. ఆ ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం.
1. జియో రూ.419 ప్లాన్
జియో రూ.419 ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే 28 రోజులు వ్యాలిడిటీ, రోజుకు 3జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 84జీబీ డేటా వస్తుంది. అలాగే అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100ఎస్ఎంఎస్‌ల బెనిఫిట్స్ ఉంటాయి. అయితే తక్కువ వ్యాలిడిటీ ఎక్కువ డేటా కావాలనుునే వారికి ఈ ప్లాన్ పక్కా సూటవుతుంది.
2. జియో రూ.601 ప్లాన్
జియో రూ.601 ప్లాన్‌లో రోజుకు 3జీబీ డేటా, వ్యాలిడిటీ 28రోజులు ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా సంవత్సరం పాటు డిస్నీ+ హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. అలాగే అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100ఎస్ఎంఎస్‌లు దక్కుతాయి.
3. జియో రూ.1199 ప్లాన్
జియో రూ.1199 ప్లాన్‌లో 84 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 3జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100ఎస్ఎంఎస్‌లు వస్తాయి. మొత్తంగా 252 జీబీ హైస్పీడ్ డేటా దక్కుతుంది.
4. జియో రూ.4199 ప్లాన్
ఎక్కువ కాలం వ్యాలిడిటీతో ప్రతీరోజు అధిక డేటా కావాలనుకునే వారికి ఈ ప్లాన్ సూటవుతుంది. జియో రూ.4199 ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే రోజుకు 3జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ సంవత్సరం అంటే 365 రోజులు ఉంటుంది.