Dangers Brushing: ఎక్కువ సేపు బ్రష్ చేస్తున్నారా.. పళ్లతో పాటు వీటికి కూడా ఎఫెక్టే..?

Dangers Brushing: ఉదయం లేచిన వెంటనే చేసే పని బ్రష్ చేయడం. దాని తర్వాతే అన్ని పనులు మొదలవుతాయి. కానీ కొంతమంది గంటల తరబడి బ్రష్ చేస్తారు.

Dangers Brushing: ఎక్కువ సేపు బ్రష్ చేస్తున్నారా.. పళ్లతో పాటు వీటికి కూడా ఎఫెక్టే..?
Dangers Brushing
Follow us

|

Updated on: Feb 22, 2022 | 12:19 PM

Dangers Brushing: ఉదయం లేచిన వెంటనే చేసే పని బ్రష్ చేయడం. దాని తర్వాతే అన్ని పనులు మొదలవుతాయి. కానీ కొంతమంది గంటల తరబడి బ్రష్ చేస్తారు. మరికొంతమంది రఫ్ బ్రషింగ్ చేస్తారు. దీనివల్ల చాలా సమస్యలు ఏర్పడుతాయి. చాలాసేపు బ్రషింగ్‌ చేయడం వల్ల పళ్లపై ఉండే ఎనామిల్ దెబ్బతింటుంది. దీంతో పళ్లు సెన్సిటివిగా మారుతాయి. త్వరగా పుచ్చిపోతాయి. హార్డ్‌ బ్రషింగ్‌ వల్ల పళ్లకి మాత్రమే కాదు చిగుళ్లు కూడా ఎఫెక్ట్‌ అవుతాయి. హార్డ్‌ బ్రిసిల్స్‌ ఉన్న బ్రష్‌ చిగుళ్లని కూడా డ్యామేజ్ చేస్తుంది. అందుకే బ్రష్ ఎప్పుడు మెత్తగా ఉండాలి. రెండు నెలలకొకసారి టూత్‌ బ్రష్ మారుస్తూ ఉండాలి. అంతేకాకుండా బ్రషింగ్‌ అనేది కేవలం 2 నుంచి 5 నిమిషాలలోపు ముగించాలి.

చక్కగా మెరిసే దంతాలు ఉంటే చాలు అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది తప్పు దంతాలతో పాటు చిగుళ్లు కూడా చాలా ముఖ్యం. తరచూ మీ చిగుళ్ల నుంచి రక్తం కారుతుంటే జాగ్రత్త పడాలని అర్థం. ఇక కరకరలాడే పదార్థాలు తిన్నప్పుడు మీ చిగుళ్లు గాయాలు కాకుండా నమలాలి. ఇక ఇన్ఫ్లమేషన్ కారణంగా చిగుళ్లు పాడవ్వటం సర్వసాధారణం. అందుకే బ్రష్ చేశాక.. మీ చిగుళ్లపై సున్నితంగా మసాజ్ చేయండి. ఏదైనా తిన్నాక ఆహారపదార్థాలు పేరుకోకుండా జాగ్రత్త పడాలి. నీటితో పుక్కిళించాలి.

వాస్తవానికి ప్రకటనలు చూసి టూత్ పేస్టులను కొనవద్దు. ఇందులో నిజం ఉండదు. అంతేకాకుండా మౌత్ వాషుల్లో ఎటువంటి పదార్ధాలున్నాయో చెక్ చేసుకోవాలి. ఎనామిల్ దెబ్బతినకుండా ఉండాలంటే కొన్నింటిని మనం పక్కన పెట్టడం చాలా అవసరం. ఇందులో సోడాలు, షుగరీ డ్రింగ్స్, ఆల్కహాల్, ధూమపానం వంటివి మీ దంతాలను పూర్తిస్థాయిలో దెబ్బ తీస్తుంటాయి. చక్కెర కలిపిన జ్యూసులను సాధ్యమైనంతగా తగ్గించుకోండి.

ఆదివారం చేపలు తింటున్నారా.. మటన్ తింటున్నారా.. ఈ విషయాలు తెలిస్తే మీ ఎంపిక మారుతుంది..?

Relationship: కొత్తగా పెళ్లైన జంటలు ఈ 4 విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి.. అవేంటంటే..?

Gas Cylinder: గ్యాస్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఈ సిలిండర్‌ ధర కేవలం రూ. 633 మాత్రమే..?

Latest Articles