Health Tips: ఒత్తిడిని కంట్రోల్ చేయలేకున్నారా..? ఈ ఆహారాలు తీసుకున్నారంటే మానసిక ప్రశాంతత మీ సొంతం..

|

Sep 13, 2023 | 10:30 AM

Health Tips: ఒత్తిడి కారణంగా ఎదురయ్యే దుష్ప్రభావాలు జుట్టు సమస్యలు, చర్మ సమస్యలనే కాక గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌కి కూడా దారితీస్తాయి. ఈ క్రమంలో ఒత్తిడి, ఆందోళనను నియంత్రించుకోవడం తప్పనిసరి. లేదంటే జరగకూడని నష్టం జరిగిపోతుంది. అయితే ఈ సమస్యలను చెక్ పెట్టేందుకు వ్యాయామంతో పాటు ఆహారంపై దృష్టి సారించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం కొన్ని రకాల ఆహారాలను తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. అవేమిటంటే..?

Health Tips: ఒత్తిడిని కంట్రోల్ చేయలేకున్నారా..? ఈ ఆహారాలు తీసుకున్నారంటే మానసిక ప్రశాంతత మీ సొంతం..
Health Tips
Follow us on

Health Tips: కూటి కోసం కోటి విద్యలు అన్నట్లుగా బతుకు బండి సాగించేందుకు నేటి మానవుడు ఉరుకుల పరుగుల జీవితాన్ని జీవిస్తున్నాడు. ఏ సమయంలో నిద్రపోతున్నాడో, ఏ సమయానికి తింటున్నాడో తనకే తెలియకుండా వ్యక్తిగత, ఉద్యోగ జీవితాలను లాక్కొస్తున్నాడు. ఇలాంటి బిజీ బిజీ లైఫ్‌స్టైల్ కారణంగానే నిత్యం స్ట్రెస్, ప్రెషర్‌తో బాధపడుతున్నాడు. ఇవి ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం. ఒత్తిడి, ఆందోళన కారణంగా శరీరంపై కలిగే దుష్ప్రభావాలు జుట్టు సమస్యలు, చర్మ సమస్యలనే కాక గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌కి కూడా దారితీస్తాయి. ఈ క్రమంలో ఒత్తిడి, ఆందోళనను నియంత్రించుకోవడం తప్పనిసరి. లేదంటే జరగకూడని నష్టం జరిగిపోతుంది. అయితే ఈ సమస్యలను చెక్ పెట్టేందుకు వ్యాయామంతో పాటు ఆహారంపై దృష్టి సారించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం కొన్ని రకాల ఆహారాలను తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. అవేమిటంటే..?

గ్రీన్ టీ: ఒత్తిడిని తగ్గించుకోవాలనుకునేవారికి గ్రీన్ టీ చాలా సింపుల్ రెమెడీ. గ్రీన్ టీలోని కెఫిన్, ఎల్-థియానైన్ అనే అమినో యాసిడ్ ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగించడంలో కీలకంగా ఉపయోగపడుతుంది.

డార్క్ చాక్లెట్: చాక్లెట్లను తినేందుకు అందరూ ఇష్టపడుతుంటారు. అయితే ఇతర చాక్లెట్ల కంటే డార్క్ చాక్లెట్‌ని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. డార్క్ చాక్లెట్‌లోని ఫ్లేవనాయిడ్స్ మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంతో పాటు ఒత్తిడి, ఆందోళనల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇంకా దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని కలగజేసే హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

బెర్రీలు: ఒత్తిడిని తగ్గించుకోవడానికి బెర్రీలు ఉత్తమ ఆహార ఎంపిక. యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్స్ ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను కంట్రోల్ చేసి మానసిన ప్రశాంతతను కలిగిస్తాయి.

ఆకు కూరలు: చాలా మంది ఆకు కూరలను తినేందుకు ఇష్టపడరు. అయితే ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. శరీర ఆరోగ్యానికి అవసరమైన ప్రోటిన్స్, మినరల్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ సహా అన్ని రకాల పోషకాలను ఆకు కూరల నుంచి మనకు లభిస్తాయి. అలాగే ఆకు కూరల్లోని యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం ఒత్తిడిని తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

డ్రై నట్స్: బాదం, వాల్‌నట్, పిస్తా పప్పులు వంటి డ్రై నట్స్ శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలను పొందేందుకు ఉత్తమ ఎంపిక. వీటిని తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యంతో పాటు ఒత్తిడి, ఆందోళన సమస్యలు తగ్గి మానసిక ప్రశాంతతను పొందవచ్చు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..