నేటి కాలంలో గుండెపోటు సైలెంట్ కిల్లర్‌గా మారుతోంది. ఇది ప్రాణాంతకమైన సమస్య. అందుకే ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన కలిగి ఉండాలి. తద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 17.9 మిలియన్ల మంది హృదయ సంబంధ వ్యాధులతో మరణిస్తున్నారు. ఇందులో మూడొంతులు గుండెజబ్బుల వల్లనే మరణిస్తున్నారట. కాబట్టి గుండె పోటు గురించిన పూర్తి అవగాహన కలిగి ఉండటం ఎంతైన అవసరం. చాలా మంది గుండెపోటు సడెన్ గా వస్తుందని అనుకుంటారు. కానీ వాస్తవం పూర్తిగా భిన్నమైనది. సాధారణంగా గుండెపోటు రాకముందే కొన్ని రకాల లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. దీన్ని గుండెపోటుకు మొదటి సంకేతం అంటారు. తాజా అధ్యయనంలో 7 లక్షణాలను పరిశోధకులు గుర్తించారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
NCBIలో ప్రచురించబడిన ఓ అధ్యయనం ప్రకారం.. గుండెపోటు లక్షణాలు ఒక నెల ముందుగానే కనిపిస్తాయి. 243 మంది వ్యక్తులపై నిర్వహించిన అధ్యయనం ప్రకారంలో ఇది తేలింది.
గుండెపోటు ప్రారంభ లక్షణాలు పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయి. తాజా అధ్యయనం ప్రకారం 50 శాతం మంది మహిళలు గుండెపోటుకు ముందు నిద్ర సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తేలింది. పురుషులలో 32 శాతం మంది మాత్రమే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. 2022 అధ్యయనం ప్రకారం ఛాతీ నొప్పి.. గుండెపోటు ప్రధాన లక్షణం. ఇది పురుషులు, స్త్రీలలో దాదాపు సమానంగా సంభవిస్తుంది. ఈ లక్షణం 93 శాతం మంది పురుషులలో, 94 శాతం మంది స్త్రీలలో కనిపించింది. అయితే ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను వెంటనే సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకుని సరైన చికిత్స తీసుకుంటే ప్రమాదం నుంచి బయటపడొచ్చు.