AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కళ్లు ఉబ్బి ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? యమ డేంజర్.. మీ కిడ్నీలు షెడ్డుకెళ్తున్నట్లే

మీ కళ్ళ చుట్టూ ఉబ్బడం - వాపు కనిపిస్తే, దానిని తేలికగా తీసుకోకండి. లేకుంటే, అది మిమ్మల్ని పెద్ద ఇబ్బందుల్లోకి నెట్టవచ్చంటున్నారు వైద్య నిపుణులు.. కళ్ళ చుట్టూ వాపు కూడా మూత్రపిండాల నష్టానికి ముందస్తు సంకేతం కావచ్చని.. ఇలాంటి లక్షణాలను విస్మరించవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..

కళ్లు ఉబ్బి ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? యమ డేంజర్.. మీ కిడ్నీలు షెడ్డుకెళ్తున్నట్లే
Swollen Eyes
Shaik Madar Saheb
| Edited By: |

Updated on: Jun 16, 2025 | 3:19 PM

Share

తరచుగా మనం ఉదయం నిద్ర లేచినప్పుడు.. మన కళ్ళతోపాటు.. వాటి చుట్టూ ఉబ్బి పోయి కనిపిస్తుంది. చాలా మంది దీనిని నిద్ర లేకపోవడం, లేదా ఎక్కువసేపు నిద్రపోవడం, లేదా ఎక్కువసేపు ఏడ్వడం, అలసట కారణంగా ఇలా కళ్లు ఉబ్బుతాయని భావిస్తారు.. కానీ అది అలా కాదు. ఈ లక్షణం ఎక్కువసేపు కొనసాగితే, అది మీ శరీరంలో దాగి ఉన్న ఏదైనా తీవ్రమైన వ్యాధికి సంకేతం కూడా కావచ్చు. ఇటీవల, ఒక పరిశోధన ప్రకారం.. కళ్ళలో కనిపించే ఈ ఉబ్బరం మన మూత్రపిండాలు దెబ్బతింటున్నాయనడానికి ముందస్తు సంకేతం కావచ్చు.. కళ్లు చుట్టూ ఎందుకు ఉబ్బుతుంది.. ఇది లోపలి నుండి ఆరోగ్యాన్ని ఎలా బలహీనపరుస్తుంది.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..

ఉబ్బిన కళ్ళు అంటే కళ్ళ కింద – చుట్టూ చర్మం వాపు.. ఈ వాపు కొన్నిసార్లు తక్కువగా ఉంటుంది.. కానీ కొన్నిసార్లు ఇది చాలా పెరిగిపోయి కనిపిస్తుంది. సాధారణంగా ప్రజలు దీనిని క్రీమ్ లేదా ఇంటి నివారణలతో తొలగించడానికి ప్రయత్నిస్తారు.. కానీ ఈ లక్షణం శరీరంలో నీరు నిలుపుదల.. ప్రోటీన్ లీకేజీకి సంకేతం కావచ్చు.. ఇది మూత్రపిండాల వైఫల్యం ప్రారంభ దశ.. అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

పరిశోధన ఏం చెప్పిందంటే..

ది లాన్సెట్ అనే మెడికల్ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైన పరిశోధన ప్రకారం.. ముఖ్యంగా ఉదయం నిద్రలేచిన తర్వాత కళ్ళలో క్రమం తప్పకుండా వాపు కనిపిస్తే, అది కొనసాగితే, మీ మూత్రపిండాలు శరీరం నుండి ప్రోటీన్‌ను ఫిల్టర్ చేయడంలో విఫలమవుతున్నాయనడానికి సంకేతం కావచ్చు. మూత్రపిండాల ప్రధాన విధి రక్తాన్ని శుభ్రపరచడం.. దాని నుండి అదనపు నీరు, విషపూరిత అంశాలను తొలగించడం.. కానీ మూత్రపిండాలు సరిగ్గా పనిచేయనప్పుడు, ప్రోటీన్ మూత్రం ద్వారా బయటకు రావడం ప్రారంభమవుతుంది.. శరీరంలో నీరు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. దాని మొదటి ప్రభావం కళ్ళు – ముఖంపై కనిపిస్తుంది.

మూత్రపిండాల నష్టం ఇతర లక్షణాలు..

ఆరోగ్య నిపుణుడు డాక్టర్ సమీర్ భాటి మాట్లాడుతూ.. కిడ్నీ వైఫల్యానికి అనేక లక్షణాలు ఉండవచ్చు. తప్పుడు ఆహారపు అలవాట్లు, క్రమరహిత జీవనశైలి కారణంగా కిడ్నీ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. కిడ్నీలో ఏదైనా సమస్య ఉంటే, అది మొదట కళ్ళలో కనిపిస్తుంది. మీ కళ్ళలో వాపు ఉంటే, మీరు శరీర ఇతర సంకేతాలపై కూడా శ్రద్ధ వహించాలి. దీనితో పాటు, తరచుగా మూత్రవిసర్జన, ముఖ్యంగా రాత్రిపూట.. మూత్రంలో నురుగు లేదా వాసన, అలసట – బలహీనత, ఆకలి లేకపోవడం, పాదాలు, చీలమండలలో వాపు, ముఖంపై పాలిపోవడం లేదా కళ్ళ కింద నల్లటి వలయాలు వంటి అనేక సాధారణ లక్షణాలు ఉన్నాయి.. ఈ లక్షణాలలో ఏవైనా కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

ఏ వ్యక్తులు ఎక్కువ ప్రమాదంలో ఉంటారు..

అధిక రక్తపోటు లేదా మధుమేహంతో బాధపడుతున్న రోగులకు మూత్రపిండాల వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే ఉప్పు లేదా ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తినేవారికి ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. తక్కువ నీరు త్రాగడం, ధూమపానం చేయడం లేదా అధికంగా మద్యం సేవించడం లేదా కుటుంబ చరిత్రలో ఎవరికైనా మూత్రపిండాల వ్యాధి ఉంటే.. అలాంటి వారు ఎక్కువగా ప్రమాదంలో ఉంటారు..

కళ్ళలో నిరంతరం వాపు ఉంటే ఏమి చేయాలి?

మీ కళ్ళ కింద నిరంతరం వాపు కనిపిస్తున్నా.. ఇంకా పైన పేర్కొన్న ఏవైనా ఇతర లక్షణాలను కూడా అనుభవిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒక సాధారణ మూత్ర పరీక్ష మీ మూత్రంలో ప్రోటీన్ మొత్తం ఎక్కువగా ఉందో లేదో వెల్లడిస్తుంది. దీనితో పాటు, రక్త పరీక్ష, మూత్రపిండాల పనితీరు పరీక్ష (KFT) ద్వారా కూడా ఈ పరిస్థితిని స్పష్టం చేయవచ్చు.

మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా?

రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు త్రాగండి.. ఉప్పు – ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించండి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. బరువును అదుపులో ఉంచండి. ధూమపానం – మద్యానికి దూరంగా ఉండండి.. రక్తపోటు, చక్కెరను అదుపులో ఉంచండి. సంవత్సరానికి ఒకసారి ఆరోగ్య తనిఖీ చేయించుకోండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి