AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పసుపు తాడు కడితే నైలాన్ తాడుతో పైకి పంపించింది.. సంతోష్‌తో కలిసి సవిత ఏం చేసిందంటే..

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం హన్మాజీపేటలో గుమ్మడి కాశీరాం అనుమానాస్పద మృతి కేసును పోలీసులు హత్య కేసుగా ఛేదించారు. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో భార్య సవిత, ఆమెకు పరిచయమైన సంతోష్, మరో వ్యక్తి రాముతో కలిసి హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

పసుపు తాడు కడితే నైలాన్ తాడుతో పైకి పంపించింది.. సంతోష్‌తో కలిసి సవిత ఏం చేసిందంటే..
Extramarital Affair Murder Case
Shaik Madar Saheb
|

Updated on: Oct 31, 2026 | 7:39 AM

Share

బాన్సువాడ (కామారెడ్డి): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో భర్తను పథకం ప్రకారం అంతమొందించిన సంచలనాత్మక ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం హన్మాజీపేటలో వెలుగుచూసింది. గుమ్మడి కాశీరాం (26) అనుమానాస్పద మృతి కేసును ఛేదించిన పోలీసులు.. ఇదొక పక్కా ప్రణాళికాబద్ధంగా జరిగిన హత్యగా తేల్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుమ్మడి కాశీరాం – సవిత భార్య భర్తలు.. కాశీరాం భార్య గుమ్మడి సవితకు పసుపుల సంతోష్ అనే వ్యక్తితో వివాహేతర పరిచయం ఏర్పడింది. తమ బంధానికి భర్త అడ్డంకిగా మారాడని భావించిన సవిత, ఎలాగైనా అతడిని మట్టుబెట్టాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో సంతోష్‌తో పాటు చింతకింద రాము అనే మరో వ్యక్తిని కలుపుకొని కాశీరాంను హతమార్చడానికి స్కెచ్ వేసింది.

మద్యం మత్తులో నైలాన్ తాడుతో దారుణం..

ప్లాన్‌లో భాగంగా ఈనెల 23వ తేదీ రాత్రి సంతోష్, రాము ఇద్దరూ కలసి కాశీరాంను మద్యం తాగుదామని నమ్మించి గ్రామ శివార్లలోని పచ్చేరు చెరువు వద్దకు తీసుకెళ్లారు. కాశీరాం పూర్తిగా మద్యం మత్తులోకి జారుకున్న తర్వాత, వారిద్దరూ నైలాన్ తాడుతో మెడకు ఉరి బిగించి అతడిని ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం ఆధారాలు లభించకుండా ఉండేందుకు మృతదేహాన్ని చెరువు నీటిలో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. కుమారుడు కనిపించకుండా పోవడం, చెరువులో శవమై తేలడంతో కాశీరాం తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదికతో పాటు సాంకేతిక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను సమగ్రంగా విశ్లేషించగా.. ఈ దారుణానికి ఒడిగట్టింది భార్య సవిత, ఆమె ప్రియుడు సంతోష్, రాము అని స్పష్టమైంది.

బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి శుక్రవారం ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రధాన నిందితురాలు సవితతో పాటు సంతోష్, రాములను అదుపులోకి తీసుకున్నామని, వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు తదితర కీలక ఆధారాలను జప్తు చేసి కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

Wife, Lover Arrested In Husband Killing

Wife, Lover Arrested In Husband Killing

Follow Us
మొయినాబాద్‌లో విషాదం.. విద్యుత్‌ తీగలు తగిలి ఇద్దరు విద్యార్థులు మృతి
మొయినాబాద్‌లో విషాదం.. విద్యుత్‌ తీగలు తగిలి ఇద్దరు విద్యార్థులు మృతి
టీమిండియాకు బీసీసీఐ షాక్.. తొలి వన్డే తర్వాత నితీశ్ అవుట్
టీమిండియాకు బీసీసీఐ షాక్.. తొలి వన్డే తర్వాత నితీశ్ అవుట్
కొత్త పింఛన్ల కోసం ఎదురుచూసేవారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
కొత్త పింఛన్ల కోసం ఎదురుచూసేవారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
పసుపు తాడు కడితే నైలాన్ తాడుతో పైకి పంపించింది
పసుపు తాడు కడితే నైలాన్ తాడుతో పైకి పంపించింది
మొబైల్ ఛార్జింగ్ బ్యాన్ చేసింది ఇందుకే.. ట్రైన్‌లో మరోసారి పేలిన
మొబైల్ ఛార్జింగ్ బ్యాన్ చేసింది ఇందుకే.. ట్రైన్‌లో మరోసారి పేలిన
బెండకాయ నీరు.. నిజంగానే ఆరోగ్యానికి అంత మంచిదా? డాక్టర్లు చెప్పిన
బెండకాయ నీరు.. నిజంగానే ఆరోగ్యానికి అంత మంచిదా? డాక్టర్లు చెప్పిన
200 దాటితే చేతులెత్తేస్తున్న అభిషేక్.. సాక్ష్యాలివే
200 దాటితే చేతులెత్తేస్తున్న అభిషేక్.. సాక్ష్యాలివే
పరగడుపున 1–2 గ్లాసుల నీరు.. శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే!
పరగడుపున 1–2 గ్లాసుల నీరు.. శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే!
నవంబర్‌లో భారీగా బ్యాంక్ సెలవులు.. ఈ తేదీలు గుర్తు పెట్టుకోండి..
నవంబర్‌లో భారీగా బ్యాంక్ సెలవులు.. ఈ తేదీలు గుర్తు పెట్టుకోండి..
చలికాలానికి Intex గీజర్లు వచ్చేశాయ్.. పూర్తి వివరాలివే
చలికాలానికి Intex గీజర్లు వచ్చేశాయ్.. పూర్తి వివరాలివే