Dry Fruits Benefits: డ్రై ఫ్రూట్స్ ని ఎండలో ఆర బెట్టి ఇలా తినండి.. సూపర్ బెనిఫిట్స్!

డ్రై ఫ్రూట్స్ తినడం చాలా మంచిది. చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు ఎవరైనా డ్రై ఫ్రూట్స్ ని తినొచ్చు. ప్రతి రోజూ ఉదయం నానబెట్టిన నట్స్ తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. అయితే డ్రై ఫ్రైట్స్ ని ఎండలో ఆర బెట్టి తింటే ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయని కొందరు నిపుణులు అంటున్నారు. సూర్య కాంతిలో నట్స్ ని ఎండ బెట్టి తింటే.. వీటిలోని శక్తి రెట్టింపు అవుతుందట. అదే విధంగా డ్రై ఫ్రూట్స్ లో..

Dry Fruits Benefits: డ్రై ఫ్రూట్స్ ని ఎండలో ఆర బెట్టి ఇలా తినండి.. సూపర్ బెనిఫిట్స్!
Dry Fruits

Edited By:

Updated on: Dec 02, 2023 | 8:57 PM

డ్రై ఫ్రూట్స్ తినడం చాలా మంచిది. చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు ఎవరైనా డ్రై ఫ్రూట్స్ ని తినొచ్చు. ప్రతి రోజూ ఉదయం నానబెట్టిన నట్స్ తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. అయితే డ్రై ఫ్రైట్స్ ని ఎండలో ఆర బెట్టి తింటే ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయని కొందరు నిపుణులు అంటున్నారు. సూర్య కాంతిలో నట్స్ ని ఎండ బెట్టి తింటే.. వీటిలోని శక్తి రెట్టింపు అవుతుందట. అదే విధంగా డ్రై ఫ్రూట్స్ లో లభించే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ఖనిజాలు, ఫైబర్, విటమిన్లు రెట్టింపు అవుతాయి. అలాగే వీటి వల్ల ఇంకా ఇతర లాభాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

వెయిట్ లాస్:

వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారు డ్రై ఫ్రూట్స్ ని ఎండలో ఆరబెట్టి తినవచ్చు. నిజానికి శీతా కాలంలో వీటిని తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారని అనుకుంటారు. కానీ నట్స్ ప్రతి రోజూ ఉదయం తినడం వల్ల బరువు తగ్గుతారని నిపుణులు అంటున్నారు. వీటిని నానబెట్టి తింటే జీవ క్రియ కూడా మెరుగు పడుతుందని, బరువు కూడా నియంత్రనలో ఉంటుందని చెబుతున్నారు.

మానసిక శక్తి పెరుగుతుంది:

డ్రై ప్రూట్స్ ప్రతి రోజూ ఉదయం తీసుకోవడం వల్ల శరీరానికి పోషకాలు లభించడమే కాకుండా మానసిక సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఉదయం పూట వీటిని తీసుకుంటే రోజంతా యాక్టీవ్ గా, ఎనర్జిటిక్ గా ఉంటారు. అంతే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

బాడీ వెచ్చదనం కోసం:

నట్స్ లో అనేక హెల్దీ అయిన కొవ్వులు ఉంటాయి. ఇవి బాడీలో హీట్ ని ఉత్పత్తి చేసేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అంతే కాకుండా కొలెస్ట్రాల్ ను సైతం నియంత్రిస్తాయి. సాధారణంగా శరీరంలో కొవ్వు తగ్గితేనే గుండె జబ్బులు అనేవి వస్తూ ఉంటాయి. అంతే కాకుండా నట్స్ లో ఓమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా ఉంటాయి కాబట్టి.. చర్మ సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

ఇమ్యూనిటీని పెంచుతాయి:

శీతా కాలంలో త్వరగా అనారోగ్యానికి గురవుతారు. ముఖ్చంగా చిన్నారు జలుబు, దగ్గు, జ్వరం వంటి వాటిన పడతారు. ఇలాంటి సమస్యలు దరి చేరకుండా ఉండాలంటే శరీరంలో తగినంత ఇమ్యూనిటీ ఉండాలి. కాబట్టి ప్రతి రోజూ ఎండలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. దీని వల్ల జబ్బుల బారిన పడకుండా ఉంటారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.