AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Care: మొలకెత్తిన పెసళ్లు vs నల్ల శనగలు.. రెండింటిలో హెల్త్‌కు అసలైన సూపర్‌ఫుడ్ ఏది?

భారతీయ సాంప్రదాయ ఆహారపు అలవాట్లలో ప్రతిరోజూ ఉదయాన్నే మొలకెత్తిన విత్తనాలు (Sprouts) తినడం ఒక ఆరోగ్యకరమైన నియమంగా వస్తోంది. ముఖ్యంగా జీర్ణశక్తిని పెంచడానికి, శరీరానికి తక్షణ పోషకాలను అందించడానికి సలాడ్ రూపంలో మొలకెత్తిన పెసరపప్పు (Moong Sprouts) , మొలకెత్తిన నల్ల శనగలను (Black Chana Sprouts) చాలా మంది తింటుంటారు. అయితే ఈ రెండింటిలో ఏది మన ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాన్ని అందిస్తుంది, ఎవరికి ఏ రకమైన ధాన్యాలు సరైన ప్రత్యామ్నాయం అనే విషయాలపై ప్రముఖ పోషకాహార నిపుణులు అందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Health Care: మొలకెత్తిన పెసళ్లు vs నల్ల శనగలు.. రెండింటిలో హెల్త్‌కు అసలైన సూపర్‌ఫుడ్ ఏది?
Sprouted Moong Vs Sprouted Chana Nutrition,
Bhavani
|

Updated on: Jul 21, 2026 | 9:01 PM

Share

పోషకాహార నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం… పప్పుధాన్యాలను మొలకెత్తించడం ద్వారా వాటిలోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్ల సాంద్రత (Density) విపరీతంగా పెరుగుతుంది. విత్తనాలు మొలకెత్తినప్పుడు అవి శరీరానికి సులభంగా అరిగేలా రూపాంతరం చెందుతాయి. అయితే పెసళ్లు, శనగలు రెండూ ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ, మీ వ్యక్తిగత శారీరక అవసరాలు , ఆరోగ్య లక్ష్యాలను బట్టి ఏది ఉత్తమమో ఎంచుకోవాల్సి ఉంటుంది.

మొలకెత్తిన పెసళ్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మొలకెత్తిన పెసరపప్పు శరీరానికి చాలా తేలికగా ఉండి, అత్యంత త్వరగా జీర్ణమవుతుంది. వీటిలో ప్రోటీన్, డయాబెటిక్ ఫైబర్, విటమిన్ సీ, విటమిన్ కే, ఫోలేట్ , మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి.

బరువు నియంత్రణ: పెసళ్లలో కేలరీల శాతం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలని (Weight Loss) కోరుకునే వారికి ఇవి ఒక అద్భుతమైన డైట్ ఆప్షన్.

ఆకలి నింత్రణ: వీటిలోని అధిక పీచు పదార్థం పొట్టను ఎక్కువ సేపు నిండుగా ఉంచి, పదేపదే వచ్చే అనవసరపు ఆకలి కోరికలను (Pang Pangs) అరికడుతుంది.

శరీరానికి చలువ: పెసళ్లలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలో వాపును తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి శరీరానికి మంచి చలవ చేస్తాయి.

మొలకెత్తిన నల్ల శనగలతో… మొలకెత్తిన నల్ల శనగలను సాటిలేని పోషకాల నిధిగా పరిగణిస్తారు. వీటిలో అధిక ప్రోటీన్, ఇనుము (Iron), కాల్షియం, ఫాస్ఫరస్ , పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి.

కండరాల బలం: నిత్యం కఠినమైన శారీరక శ్రమ చేసేవారికి, క్రీడాకారులకు , జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేసేవారికి (Bodybuilders) కండరాల ఎదుగుదల కోసం శనగలు అత్యుత్తమ ఆహార వనరు.

సుదీర్ఘ శక్తి & ఐరన్: శనగలు శరీరానికి రోజంతా నిలిచి ఉండే సహజమైన శక్తిని అందిస్తాయి. వీటిలోని అధిక ఐరన్ శాతం రక్తంలో హిమోగ్లోబిన్ పెంచి, రక్తహీనత (Anemia) ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

అయితే కొంతమందికి నల్ల శనగలను జీర్ణం చేసుకోవడంలో ఇబ్బంది ఉండవచ్చు. గ్యాస్ లేదా పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా ఉండటానికి వీటిని బాగా నమిలి, పరిమిత పరిమాణంలోనే తీసుకోవాలి.

ఆరోగ్యానికి ఏవి మంచివి? మీ లక్ష్యం బరువును వేగంగా అదుపులో ఉంచుకోవడం, తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం , జీర్ణక్రియను (Digestion) మెరుగుపరుచుకోవడం అయితే మొలకెత్తిన పెసళ్లను ఎంచుకోవడం అత్యంత సురక్షితమైన మార్గం. అదే సమయంలో మీకు ఎక్కువ ప్రోటీన్, బలం, ఐరన్ , వ్యాయామానికి కావలసిన శక్తి కావలసి వస్తే మొలకెత్తిన నల్ల శనగలు తింటే మంచి ఫలితం ఉంటుంది.

గమనిక (Disclaimer): ఈ కథనంలో అందించబడిన పోషకాహార సమాచారం , ఆరోగ్య సూచనలు కేవలం ప్రముఖ ఆహార నిపుణుల నివేదికలు , సాధారణ అవగాహన ఆధారంగా ఇచ్చింది మాత్రమే. వృత్తిపరమైన డైటీషియన్ లేదా వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మీ వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితి , అలర్జీలను బట్టి తగిన ఆహార నియమాలను ఎంచుకోవాల్సిందిగా మనవి.

Follow Us