AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Alert: వాసన తెలియకపోవడం కరోనా వల్లనే కాదు.. ఆ వ్యాధి వల్ల కూడా కావచ్చు.. అప్రమత్తత అవసరం..

వాసనను అనుభవించలేని పరిస్థితి కోవిడ్ పెద్ద లక్షణం. కోవిడ్ ఉన్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుందని చాలామంది అనుకుంటారు. కానీ అది అలా కాదు. వాసన చూసే సామర్థ్యం తగ్గే అనేక వ్యాధులు ఉన్నాయి.

Health Alert: వాసన తెలియకపోవడం కరోనా వల్లనే కాదు.. ఆ వ్యాధి వల్ల కూడా కావచ్చు.. అప్రమత్తత అవసరం..
Health Alert
KVD Varma
|

Updated on: Aug 29, 2021 | 9:03 AM

Share

Health Alert: వాసనను అనుభవించలేని పరిస్థితి కోవిడ్ పెద్ద లక్షణం. కోవిడ్ ఉన్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుందని చాలామంది అనుకుంటారు. కానీ అది అలా కాదు. వాసన చూసే సామర్థ్యం తగ్గే అనేక వ్యాధులు ఉన్నాయి. వాసన తగ్గడం అల్జీమర్స్, స్కిజోఫ్రెనియా లేదా మరొక స్వయం ప్రతిరక్షక వ్యాధికి సంకేతం కావచ్చు. ఈ వ్యాధులలో, వాసన కోసం పనిచేసే మెదడు భాగం తగ్గిపోతుంది లేదా ప్రభావితమవుతుంది. పార్కిన్సన్ ఫౌండేషన్ ప్రకారం, పార్కిన్సన్ వ్యాధి ఉన్న చాలా మందికి వాసన తగ్గుతుంది. దీనిని హైపోస్మియా అంటారు. ఈ సందర్భంలో అది తీవ్రమైన ముప్పు కావచ్చు.

మరణ ప్రమాదం 50 శాతం వరకు పెరుగుతుంది

అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ ప్రకారం, రాబోయే 10 సంవత్సరాలలో మరణించే ప్రమాదం 50% వరకు ఎక్కువగా ఉంటుంది. అయితే, కొన్నిసార్లు ఈ సామర్థ్యం సాధారణ జలుబులో కూడా తగ్గుతుంది. ఇది కాకుండా, వాసన చూసే సామర్థ్యం తగ్గితే, జాగ్రత్తగా ఉండండి. నిపుణులు, రినిటిస్, ఔషధాల దుష్ప్రభావాలు, వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా వాసన కోల్పోవడం వెనుక ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో బ్రెయిన్ ట్యూమర్ ఉన్నప్పటికీ ఇది జరగవచ్చు. సుదీర్ఘకాలం వాసన కనిపించకపోతే, అది చిత్తవైకల్యం  లక్షణం కూడా కావచ్చు.

బుక్‌లెట్ పరీక్ష వాసన చూపే సామర్థ్యాన్ని వివరిస్తుంది.

వైద్ఇంయులు వాసన చూసే సామర్ధ్యాన్ని పరీక్షించేందుకు ఒక బుక్‌లెట్ ఉపయోగిస్తారు. ఇది అనేక పేజీలతో ఉంటుంది. ఇందులో చిన్న బుడగలు వాసన లక్షణాలతో  నిండి ఉంటాయి. బాధితుడు ప్రతి పేజీని స్క్రాప్ చేయమని, వాసనను గుర్తించమని అడుగుతారు. వారు వాసనను పసిగట్టలేకపోతే, లేదా దానిని తప్పుగా గుర్తించగలిగితే, అది వాసన తగ్గే సామర్థ్యానికి సంకేతంగా పరిగనిస్తారు. ఈ పరీక్ష ముక్కు, చెవి, గొంతు నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి.

ఫోర్టిస్ హాస్పిటల్‌లో ఇంటర్నల్ మెడిసిన్ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మనోజ్ శర్మ మాట్లాడుతూ పురుషుల కంటే మహిళలకు వాసన ఎక్కువగా ఉంటుంది. గర్భిణీలో ఈ సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. వాసన తెలియని పరిస్థితి ఉన్నపుడు వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆయన కోరారు.

Also Read: Pista Benefits: పిస్తా పప్పు తినడం వల్ల 5 అద్భుత ప్రయోజనాలు..! తెలిస్తే అస్సలు వదలరు..

Health Tips: మీరు ఉదయం లేవగానే ఇలా చేయండి.. రోజంతా హుషారుగా ఉంటారు..!