AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Protein Deficiency: ఆహారంలో ప్రోటీన్ తక్కువైతే ప్రమాదమే.. శరీరం ఇచ్చే ఈ 6 హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకండి!

మనం రోజువారీ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా సరే.. మన శరీరం మాత్రం నిరంతరం లోపల మరమ్మతులు చేసుకుంటూనే ఉంటుంది. ఈ మరమ్మతులకు కావాల్సిన అన్నింటినీ ఫుడ్ రూపంలో మనం అందించాలి. వాటిలో అతి ముఖ్యమైన ముడి పదార్థం ఏంటో మీకు తెలుసా?

Protein Deficiency: ఆహారంలో ప్రోటీన్ తక్కువైతే ప్రమాదమే.. శరీరం ఇచ్చే ఈ 6 హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకండి!
Protein Deficiency
Nikhil
|

Updated on: Jan 29, 2026 | 9:04 AM

Share

అదే ‘ప్రోటీన్’. దీనిని శాస్త్రీయంగా ‘శరీర నిర్మాణ దారువు’ అని పిలుస్తారు. అంటే మన ఇల్లు కట్టడానికి ఇటుకలు ఎంత అవసరమో, మన బాడీ బిల్డ్ అవ్వడానికి ప్రోటీన్ అంత అవసరం. అయితే దురదృష్టవశాత్తూ మనలో చాలామంది కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్స్ ఉన్న ఆహారానికి ఇచ్చే ప్రాధాన్యతను ప్రోటీన్ కు ఇవ్వరు. ఆహారంలో దీని పరిమాణం తగ్గితే కేవలం కండరాలు మాత్రమే కాదు.. మీ రోగనిరోధక శక్తి, మానసిక స్థితి, చివరకు మీ అందం కూడా దెబ్బతింటుంది. మీ బాడీలో ప్రోటీన్ తక్కువగా ఉంటే శరీరం కొన్ని రహస్య సంకేతాలను పంపిస్తుంది. అవేంటో తెలిస్తే మీరు వెంటనే మీ డైట్ మార్చుకుంటారు.

శరీరంలో కలిగే లక్షణాలు..

శరీరానికి బయట నుంచి ప్రోటీన్ అందనప్పుడు, అది మన కండరాల్లో దాగి ఉన్న ప్రోటీన్‌ను వాడటం ప్రారంభిస్తుంది. దీనివల్ల కండరాలు బలహీనపడతాయి. ముఖ్యంగా వయసు పెరుగుతున్న వారు ప్రోటీన్ సరిగ్గా తీసుకోకపోతే నడకలో పటుత్వం తగ్గుతుంది, త్వరగా అలసిపోతుంటారు.

  •  మన శరీరంలో వ్యాధులతో పోరాడే సైనికుల్లాంటి యాంటీబాడీస్ ప్రోటీన్‌తోనే తయారవుతాయి. దీని లోపం ఏర్పడినప్పుడు ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఫలితంగా తరచుగా జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. చిన్న గాయాలు అయినా మానడానికి చాలా సమయం పడుతుంది.
  • ఎముకలు అనగానే అందరూ కాల్షియం గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ ఎముకల సాంద్రతను కాపాడటంలో ప్రోటీన్ పాత్ర చాలా ఉంది. ప్రోటీన్ లోపం వల్ల ఎముకలు గుల్లబారిపోయి చిన్న దెబ్బ తగిలినా ఫ్రాక్చర్లు అయ్యే ప్రమాదం పెరుగుతుంది
  •  మన చర్మం, జుట్టు, గోళ్లు అన్నీ ‘కెరాటిన్’, ‘కొలాజెన్’ వంటి ప్రోటీన్లతోనే తయారవుతాయి. ఆహారంలో ప్రోటీన్ తగ్గితే జుట్టు పల్చబడటం, రంగు మారడం, చర్మం పొడిబారి పగుళ్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గోళ్లు కూడా పెళుసుగా మారి త్వరగా విరిగిపోతాయి.
  •  ప్రోటీన్ మనకు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. ఒకవేళ మీరు భోజనం చేసిన కొద్దిసేపటికే మళ్ళీ ఆకలి వేస్తున్నా.. లేదా తీపి పదార్థాలు తినాలనిపిస్తున్నా మీ శరీరానికి ప్రోటీన్ అందడం లేదని అర్థం. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తిన్నప్పుడు ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది.
  •  శరీరంలో శక్తి స్థాయిలను నిర్వహించడానికి ప్రోటీన్ అవసరం. దీని లోపం వల్ల మెదడు మొద్దుబారినట్లు అనిపించడం (Brain Fog), ఏ పని మీద శ్రద్ధ పెట్టలేకపోవడం జరుగుతుంది. రోజంతా నిస్సత్తువగా ఉన్నట్లు అనిపిస్తే మీ ప్రోటీన్ ఇన్టేక్ చెక్ చేసుకోవాలి.

సాధారణ ఆరోగ్యవంతుడైన వ్యక్తికి తన శరీర బరువులో ప్రతి కిలోకు 0.8 గ్రాముల నుంచి 1 గ్రాము వరకు ప్రోటీన్ అవసరం. ఉదాహరణకు మీరు 60 కిలోల బరువు ఉంటే, మీకు రోజుకు కనీసం 48 నుండి 60 గ్రాముల ప్రోటీన్ కావాలి. గర్భిణీలు, క్రీడాకారులు, వ్యాయామం చేసేవారు ఇంకా ఎక్కువ మొత్తంలో తీసుకోవాల్సి ఉంటుంది. శాకాహారులు తమ ఆహారంలో పప్పుధాన్యాలు, పనీర్, సోయా, బాదం, వాల్‌నట్స్ వంటి నట్స్ ను భాగం చేసుకోవాలి.

అలాగే చియా సీడ్స్, గుమ్మడి గింజలు, పాలు, పెరుగు తీసుకోవడం ద్వారా కూడా ప్రోటీన్ లోపాన్ని అధిగమించవచ్చు. ఇవి సహజంగా మనకు శక్తిని ఇచ్చి శరీరాన్ని దృఢంగా ఉంచుతాయి. ఆరోగ్యం అనేది మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. ప్రోటీన్ లోపాన్ని కేవలం ఒక సమస్యగా కాకుండా శరీరానికి కావలసిన మౌలిక వసతిగా గుర్తించాలి. ఈ రోజు నుంచే మీ భోజనంలో ప్రోటీన్ ఉండేలా ప్లాన్ చేసుకోండి.