AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెవులకే కాదు.. మెదడుకూ ప్రమాదమే..! హెడ్‌ ఫోన్స్‌ తో జాగ్రత్త.. మీ అలవాటును మార్చుకోలేదో అంతే సంగతి..!

హెడ్‌ ఫోన్స్ వాడకుండా ఉండటం చాలా మందికి కష్టం. కానీ ఎక్కువ సౌండ్‌ తో పాటలు వినడం లేదా కాల్స్‌ లో మాట్లాడటం కేవలం చెవులకే కాదు.. మెదడు, నరాల వ్యవస్థకు కూడా హానికరం. ఈ అలవాట్ల వల్ల శరీరంలో చాలా రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

చెవులకే కాదు.. మెదడుకూ ప్రమాదమే..! హెడ్‌ ఫోన్స్‌ తో జాగ్రత్త.. మీ అలవాటును మార్చుకోలేదో అంతే సంగతి..!
Ear Phones Side Effects
Prashanthi V
|

Updated on: Jul 07, 2025 | 5:54 PM

Share

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ ఫోన్‌ లు ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అయ్యాయి. రోజూ పాటలు వినడం, వీడియోలు చూడటం లేదా కాల్ మాట్లాడేటప్పుడు హెడ్‌ ఫోన్‌ లు వాడటం అందరిలోనూ మామూలే అయిపోయింది. అయితే ఎక్కువ వాల్యూమ్‌ లో వినడం అనే అలవాటు అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. ఇది చెవులకే కాకుండా మెదడు, నరాల వ్యవస్థపై కూడా చెడు ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వినికిడి లోపం

ఎప్పుడూ ఎక్కువ శబ్దంతో ఆడియో వింటూ ఉండటం వల్ల చెవుల్లో ఉండే సున్నితమైన కణాలు నెమ్మదిగా దెబ్బతింటాయి. దీని ఫలితంగా వినికిడి శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఇది మొదట్లో పెద్ద సమస్యగా కనిపించకపోయినా.. కాలక్రమేణా శాశ్వత వినికిడి లోపానికి దారితీస్తుంది.

నరాల వ్యవస్థపై ఒత్తిడి

అధిక శబ్దం వల్ల కేవలం చెవి మాత్రమే కాదు.. నరాల వ్యవస్థ కూడా ప్రభావితమవుతుంది. దీని వల్ల తలనొప్పులు, చికాకు, అలసట, ఆందోళన మానసిక ఒత్తిడి తలెత్తుతాయి. శబ్ద ఒత్తిడికి గురైనప్పుడు మెదడు అనవసరంగా అలసిపోతుంది.

మెదడు పనితీరు గందరగోళం

ఎప్పుడూ ఎక్కువ శబ్దాన్ని వినడం వల్ల మెదడు తాత్కాలికంగా గందరగోళంగా మారుతుంది. దీని వల్ల మనసు ఏదైనా పనిలో నిలపడం కష్టంగా మారుతుంది. నిద్ర సమస్యలు, ఒత్తిడి, మానసిక అశాంతి వంటి ప్రభావాలు కనిపిస్తాయి.

విశ్రాంతి లోపం

కొంతమంది వ్యక్తులు పూర్తిగా మొబైల్‌ కు అంకితం కావడంతో వారి చెవులు, మెదడు విశ్రాంతి పొందే అవకాశం కోల్పోతాయి. మధ్యలో విరామం లేకుండా మ్యూజిక్ వింటూ ఉండటం వల్ల శరీరానికి విరామం దొరకదు. ఇది నిద్రలేమికి ప్రధాన కారణాల్లో ఒకటి.

మానసిక స్థితి దెబ్బతినే అవకాశం

ఎక్కువ సౌండ్‌ లో ఉండటం వల్ల మానసిక స్థితి స్థిరంగా ఉండదు. చిరాకు, ఒత్తిడి, కోపం, అసహనం వంటి భావోద్వేగాలు పెరిగే ప్రమాదం ఉంది. దీన్ని చాలా మంది తేలికగా తీసుకుంటారు కానీ దీర్ఘకాలికంగా చూస్తే దీని ప్రభావం తీవ్రమవుతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఈ సమస్యలన్నింటినీ మనం కొన్ని సులభమైన అలవాట్లతో దూరం చేసుకోవచ్చు. హెడ్‌ ఫోన్స్‌ లో పాటలు వినేటప్పుడు వాల్యూమ్‌ ని తక్కువగా పెట్టుకోండి. ప్రతీ అరగంటకు ఒకసారి విరామం తీసుకుని చెవులకు విశ్రాంతి ఇవ్వండి. అలాగే నిశ్శబ్ద వాతావరణంలో కాసేపు గడపడం వల్ల మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది.

మొబైల్ ఫోన్ వాడకం తప్పదు కానీ.. ఎక్కువ శబ్దంతో పాటలు వినడం లేదా ఫోన్‌ లో మాట్లాడటం అనేది చిన్న అలవాటుగా అనిపించినా దాని వెనుక పెద్ద ఆరోగ్య సమస్యలు దాగి ఉన్నాయి. అధిక శబ్దంతో వినే అలవాటును తగ్గించుకోవడమే మీ ఆరోగ్యాన్ని కాపాడే సరైన మార్గం.