Rose Masala Chai: వణికే చలిలో రోజ్ మసాలా ఛాయ్ తాగితే ఉంటుంది.. తయారీ విధానం..
ఎప్పుడూ తాగే టీ తాగితే స్పెషల్ ఏముటుంది చెప్పండి. చలికి చెక్ పెట్టేందుకు స్పెషల్ టీ అయితే మరింత బాగుంటుంది. అయితే ఆ టీ కేవలం రుచి మాత్రమే కాకుండా, ఆరోగ్యాన్ని మెరుగుపరిచేది కూడా అయితే మరింత మంచిది. అలాంటి ఆరోగ్యాన్ని పెంపొదించే టీలో రోజ్ మసాలా ఛాయ్ ఒకటి. ఈ ఛాయ్ తాగడం వల్ల చలికి చెక్ పెట్టడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు...
వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వర్షాలు కురుస్తుండడంతో వెదర్ చల్లగా మారిపోయింది. ఇక వచ్చేది కూడా చలి కాలమే. మరో నెల రోజులు గడిస్తే చలి తీవ్రత మరింత పెరుగుతుంది. అయితే గజగజ వణికే చలిలో గరగరం చాయ్ తాగితే ఆ కిక్కే వేరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంతటి చలి అయినా సరే ఒక కప్పు టీ తాగితే శరీరం ఒక్కసారిగా హీటెక్కుతుంది.
అయితే ఎప్పుడూ తాగే టీ తాగితే స్పెషల్ ఏముటుంది చెప్పండి. చలికి చెక్ పెట్టేందుకు స్పెషల్ టీ అయితే మరింత బాగుంటుంది. అయితే ఆ టీ కేవలం రుచి మాత్రమే కాకుండా, ఆరోగ్యాన్ని మెరుగుపరిచేది కూడా అయితే మరింత మంచిది. అలాంటి ఆరోగ్యాన్ని పెంపొదించే టీలో రోజ్ మసాలా ఛాయ్ ఒకటి. ఈ ఛాయ్ తాగడం వల్ల చలికి చెక్ పెట్టడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇంతకీ రోజ్ మసాలా ఛాయ్‌ని ఎలా తయారు చేసుకోవాలి.? దీనికి కావాల్సిన వస్తువులు ఏంటి.? తయారీ విధానం ఏంటి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
రోజ్ మసాలా ఛాయ్‌లో సుంగధ ద్రవ్యాలు, గులాబీ రేకులు సమృద్ధిగా ఉంటాయి. దీంతో ఇది ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు రుచిలో కూడా అమోఘంగా ఉంటుంది. రోజ్ టీ తాగడం వల్ల జీర్ణ క్రియ వేగవంతమవుతుంది. గులాబీల్లో ఉండే విటమిన్ ఏ,సీలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ రోజ్ టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ అధిక రక్తపోటుకు నియంత్రిస్తుంది.
అధిక రక్తపోటుకు కారణమయ్యే ఫ్రీరాడికల్స్ నియంత్రించవచ్చు. అలాగే చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలకు ఈ టీతో చెక్ పెట్టొచ్చు. ఈ టీలో ఉండే యాంటీ వైరల్, యాంటీ ఫంగ్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు సీజనల్ వ్యాధులను తగ్గిస్తాయి. ఇక నెలసరి నొప్పులతో బాధపడేవారు రోజ్ మసాలా చాయ్‌ని తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
ఎలా తయారు చేసుకోవాలంటే..
ముందుగా పాలను వేడి చేసి అందులో టీ పౌడర్‌ను వేయాలి. అనంతరం కాసేపు మరిగిన తర్వాత ఎండు గులాబీ రేకులు, ఒక చెంచాడు తులసి పొడి వేయాలి. అనంతరం అందులో చిటికెడు దాల్చిన చెక్క పొడి, రెండు యాలకుల్ని వేయాలి. అనంతరం బాగా మరగనివ్వాలి. చివరిగా టీని వడకట్టి అందులో కాస్త తేనె కలపాలి. అంతే గరంగరం రోజ్ మసాలా టీ తయారైనట్లే. చలికి చెక్ పెడుతూ, ఆరోగ్యాన్ని కాపాడే ఈ రోజ్ టీని మీరు తాగేయండి మరీ.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..