Health News: చర్మంపై ఎర్రటి దద్దుర్లు, దురదగా ఉంటుందా.. ఇవి భయంకరమైన ఆ వ్యాధి లక్షణాలు..!

|

Mar 20, 2022 | 6:05 AM

Health News: కొంతమందికి చర్మంపై తరచుగా ఎర్రటి దద్దుర్లు, దురదగా ఉంటుంది. అయినా వారు వీటిని పట్టించుకోరు. కానీ వైద్యులు ఇది సోరియాసిస్ అని చెబుతున్నారు. ఇది క్రమంగా శరీరం

Health News: చర్మంపై ఎర్రటి దద్దుర్లు, దురదగా ఉంటుందా.. ఇవి భయంకరమైన ఆ వ్యాధి లక్షణాలు..!
Psoriasis
Follow us on

Health News: కొంతమందికి చర్మంపై తరచుగా ఎర్రటి దద్దుర్లు, దురదగా ఉంటుంది. అయినా వారు వీటిని పట్టించుకోరు. కానీ వైద్యులు ఇది సోరియాసిస్ అని చెబుతున్నారు. ఇది క్రమంగా శరీరం అంతటా వ్యాపిస్తుంది. ఎవరికైనా అలాంటి సమస్య ఉంటే దానిని తేలికగా తీసుకోవద్దు. వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. ఆహారం, జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారా ఈ వ్యాధిని నియంత్రించవచ్చు. ఈ వ్యాధి పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదు. కానీ కంట్రోల్‌ చేయవచ్చు. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. సోరియాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ వ్యాధి. అంటే శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల ఇది జరుగుతుంది. దీంతో చర్మంపై ఎర్రటి మచ్చలు ఏర్పడతాయి. ఈ వ్యాధిలో ఒక వ్యక్తికి అకస్మాత్తుగా తీవ్రమైన దురద పెడుతుంది. చర్మంపై వాపులు ఏర్పడుతాయి. ఈ సమస్య ఎక్కువగా చేతులు, మోకాళ్లు, వీపు, మోచేతులపై కనిపిస్తుంది. చాలా మంది రోగులలో గోళ్ల రంగు కూడా మారుతుంది. ఈ వ్యాధిని నియంత్రించాలంటే ఆహారంపై శ్రద్ధ పెట్టాల్సిందే. సోరియాసిస్ సమస్యలు ఉన్నవారు ఎక్కువ, కొవ్వు, ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం మానుకోవాలి.

ఈ వ్యాధి జన్యుపరంగా కూడా వస్తుంది

ఈ వ్యాధి జన్యుపరమైన కారణాల వల్ల కూడా వస్తుంది. వాతావరణంలో మార్పుల కారణంగా చాలా సార్లు ప్రజలు దీనికి బాధితులవుతారు. శీతాకాలంలో సోరియాసిస్ కేసులు ఎక్కువగా రావడానికి ఇదే కారణం. విటమిన్ డి లోపం కూడా ఈ వ్యాధికి కారణమవుతుంది. ఇప్పటికే సోరియాసిస్ సమస్య ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించడం మంచిది.

ఈ విషయాలను గుర్తుంచుకోండి

సోరియాసిస్ రాకుండా ఉండాలంటే చర్మం పొడిబారకుండా చూసుకోవాలి. చర్మంపై మాయిశ్చరైజర్‌ని ఉపయోగించాలి. ఎక్కువగా మద్యం లేదా పొగ తాగితే తగ్గించండి. ఒత్తిడికి దూరంగా ఉండండి. ఎందుకంటే మానసిక ఒత్తిడి వల్ల సొరియాసిస్ వంటి సమస్య తీవ్రమవుతుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా సహాయం తీసుకోండి. మీరు పెర్ఫ్యూమ్ వాడేవారు అయితే ఉపయోగించడం మానుకోండి.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Virat Kohli: విరాట్‌ కోహ్లీపై సినిమా తీస్తే టైటిల్‌ ఏంటో తెలుసా..!

Telangana: నిరుద్యోగులకి తీపి కబురు.. వయోపరిమితి పెంచుతూ ఉత్తర్వులు జారీ..

CONGRESS PARTY: కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం దిశగా కీలక అడుగు.. జీ23 నేతల సూచనలపై సోనియా స్పందన.. వచ్చేవారం కీలక భేటీ