Water: కలుషిత నీరు తాగితే ఇంత ప్రమాదమా.? ఈ విషయాలు తెలిస్తే..
ప్రస్తుతం కాలుష్యం ఓ రేంజ్‌లో పెరిగిపోతోంది. వాయుకాలుష్యం మొదలు జల కాలుష్యం వరకు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. అయితే పారిశ్రామీకరణ పెరిగిన నేపథ్యంలో రసాయనాలు ఇష్టారాజ్యంగా వదిలేస్తున్నారు. దీంతో నీరు కాలుష్యంగా మారుతోంది. ఇలాంటి నీటిని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. భారీ లోహాలు, పురుగుల మందుల కారణంగా నీటి కాలుష్యం పెరుగుతోంది...

మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జీవక్రియలో నీటికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు నీటితో పరిష్కారం చూపొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే శరీరానికి మేలు చేసే మంచినీరు హాని కూడా చేస్తుందని మీకు తెలుసా.? అవును కలుషిత నీరు తీసుకుంటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం కాలుష్యం ఓ రేంజ్‌లో పెరిగిపోతోంది. వాయుకాలుష్యం మొదలు జల కాలుష్యం వరకు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. అయితే పారిశ్రామీకరణ పెరిగిన నేపథ్యంలో రసాయనాలు ఇష్టారాజ్యంగా వదిలేస్తున్నారు. దీంతో నీరు కాలుష్యంగా మారుతోంది. ఇలాంటి నీటిని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. భారీ లోహాలు, పురుగుల మందుల కారణంగా నీటి కాలుష్యం పెరుగుతోంది. ఇలాంటి నీటిని తాగడం వల్ల శరీరం ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఇంతకీ కలుషిత నీటిని తాగడం వల్ల కలిగే దుష్ఫ్రభావాలు ఏంటి.? ఎలా తప్పించుకోవాలో ఇప్పుడు చూద్దాం..
నిపుణులు అభిప్రాయం ప్రకారం నీటి కాలుష్యానికి సూక్ష్మ జీవుల కాలుష్య కారకాలు కూడా ప్రధాన కారణమని చెబుతున్నారు. సూక్ష్మ జీవులున్న నీటిని తీసుకుంటే అవి నేరుగా పేగుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా నీటిలో ఉండే ఎనాటోమెబిస్టోలిటికా, ఇకోలి, సాల్మొనెల్లా గియార్డియా వంటి బ్యాక్టీరియాలు తీవ్రమైన కడుపు ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల ప్రాణాప్రాయం కూడా సంభవించే అవకాశం ఉంది.
కలుషిత నీటిలో ఎక్కువ మొత్తంలో సీసం, ఆర్సెనిక్, పాదరసం వంటివి ఉంటాయి. ఇవి జీర్ణ ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తాయి. ఈ విష కణాలు జీర్ణశక్తిని బలహీనపరుస్తాయి. దీని కారణంగా కడుపులో పుండ్లు, అల్సర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. కలుషిత నీటిని తాగితే.. పేగు వ్యాధి, డైస్పియోసిస్ వంటి జీర్ణశయ సమస్యలకు కూడా దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇక కలుషిత నీటితో కలిగే దుష్ప్రభావాలకు చెక్ పెట్టేందుకు మరిగించిన నీటిని తాగడం బెస్ట్ ఆప్షన్‌గా నిపుణులు చెబుతున్నారు. కాచి చల్లార్చిన నీటిని తాగితే ఇలాంటి సమస్యలు దరి చేరకుండా చూసుకోవచ్చు. మరీ ముఖ్యంగా శీతాకాలంలో బ్యాక్టీరియాలు వృద్ధి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో కచ్చితంగా మరిగించి, చల్లార్చిన నీటినే తాగాలి. అదే విధంగా ఫిల్టర్ల ద్వారా కూడా నీటిని శుద్ధి చేసుకొని తాగొచ్చు.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..
