Platelet Count: ప్రస్తుతం రక్తహీనతతో పాటు ఇతర వ్యాధుల బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ప్లేట్‌లెట్స్ పడిపోవడంతో ప్రమాదం పొంచివుండే అవకాశం ఉంది. ఇక డెంగీ జ్వరం వచ్చిందంటే చాలు అధికంగా ప్లేట్‌లెట్స్ క్షీణిస్తుంటాయి. ఆ సమయంలో రక్తంలో ఉన్న వాటి సంఖ్య ఒకేసారి పడిపోతుంది. దీంతో ఆరోగ్యం మరింత క్షీణించి ప్రాణాలకే ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి జ్వరం వచ్చినప్పుడు వైద్యులు ఇచ్చే మందులతో పాటు కొన్ని రకాల పండ్లు, ఇతర ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా ప్లేట్‌లెట్ల సంఖ్యను వేగంగా పెంచుకోవచ్చు.
ప్లేట్‌లెట్స్ తగ్గడానికి కారణాలేమిటి..?
శరీరంలో ప్లేట్‌లెట్స్ తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. డెంగ్యూ, మలేరియా, వైరల్ ఇన్‌ఫెక్షన్ వల్ల శరీరంలో ప్లేట్‌లెట్స్ తగ్గుతాయి. కొందరికి పుట్టుకతో జన్యు సమస్యల వల్ల ప్లేట్‌లెట్స్ తగ్గుతాయి. ప్రస్తుత జనరేషన్‌లో గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు రక్తం పలుచబడటానికి ఉపయోగించే మందుల వల్ల ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ప్లేట్‌లెట్స్ మరీ తక్కువగా ఉన్నపుడు ఏ గాయం లేకపోయినా రక్తస్రావం అవుతుంది. ప్లేట్ లెట్స్ సక్రమంగా తమ విధిని నిర్వహించలేకపోతే రక్తస్రావం ఆగదు. దానికి ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోవడం గానీ ప్లేట్‌లెట్ల నాణ్యత తగ్గిపోవడంగానీ కారణం కావచ్చు అంటున్నారు.
ప్లేట్‌లెట్స్ ఎక్కువగా ఉంటే ఉపయోగమా..?
తెల్ల రక్తకణాలు వ్యాధి నిరోధకాలుగా పనిచేస్తూ శరీరం రోగాల బారిన పడకుండా కాపాడుతుంటాయి. ఎర్ర రక్తకణాల్లో ఉండే హిమోగ్లోబిన్ ద్వారా శరీరం మొత్తానికి అవసరమైన ఆక్సీజన్ అందిస్తుంది. ఇక మిగిలినవి ప్లేట్ లెట్స్ శరీరానికి గాయం అయినప్పుడు రక్తం గడ్డకట్టడానికి తోడ్పడుతాయి. ఇవి అందరిలోనూ ఒకే విధంగా ఉండవు. సాధారణంగా ఒక వ్యక్తిలో 1.5 లక్షల నుంచి 4.5 లక్షల ప్లేట్‌లెట్స్ ఉంటాయి. ప్లేట్‌లెట్స్ కణం 7-10 రోజుల వరకు బతికి ఉంటుంది. ఎముక మజ్జలో ఏర్పడిన కొత్త ప్లేట్‌లెట్స్ మళ్లీ రక్తంలో చేరుతాయి. రక్తాన్ని గడ్డ కట్టించి ప్రాణరక్షణ కలిగించే కీలకమైన కణాలు ప్లేట్‌లెట్స్.
ప్లేట్‌లెట్స్ పెరగాలంటే ఏం చేయాలి..?
ఆప్రికాట్ పండ్లను రోజు రెండు సార్లు తీసుకుంటే చాలు. రక్తం వృద్ధి చెంది ప్లేట్‌లెట్స్ పెరుగుతాయి. ఎండు ఖర్జూరం, కివీ పండ్లను తింటున్నా ప్లేట్‌లెట్లను బాగా పెంచుకోవచ్చు. దీంతో వ్యాధి తగ్గుముకం పడుతుంది. బొప్పాయి పండ్లు డెంగీ వ్యాధికి మంచి ఔషధంగా పని చేస్తుంది. దీని ద్వారా డెంగీ జ్వరం నుంచి బయటపడడమే కాకుండా వేగంగా ప్లేట్‌లెట్ల సంఖ్య పెరిగిపోతాయి. దానిమ్మ పండ్లను తిన్నా ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతాయి. ఇవి రక్తం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి.
ఇవి తీసుకుంటే ప్లేట్‌లెట్స్ వేగంగా పెరుగుతాయి..
అలాగే ఆకుపచ్చగా ఉండే ఆకు కూరలు, కూరగాయలను ఎక్కువగా తినాలి. దీంతో వాటిలో ఉండే విటమిన్ కె ప్లేట్‌లెట్ల సంఖ్య పెంచుతుంది. వెల్లుల్లి రేకులను ఆహారంలో భాగంగా తీసుకుంటే ఎంతో ఉపయోగం ఉంటుంది. దీంతో ప్లేట్‌లెట్ల సంఖ్య సమృద్దిగా పెరుగుతుంది. బీట్ రూట్ జ్యూస్ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ జ్యూస్ రక్తహీనతతో బాధపడేవారే కాకుండా డెంగీ వచ్చిన వారు కూడా తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది. క్యారెట్‌ను తరచూ తింటున్నా రక్తం వృద్ది చెంది తద్వారా ప్లేట్‌లెట్స్ పెరుగుతాయి. ఇలా డెంగీ జ్వరం వచ్చి ప్లేట్‌లెట్స్ పడిపోయినా, రక్తహీనతతో బాధపడుతున్న వారు ఈ పండ్లను తీసుకున్నట్లయితే వైద్యుడి వద్దకు వెళ్లకుండా ఇంట్లో ఉండే నయం చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి: