Kidney Protection Tips: మీ అలవాట్లే కిడ్నీ సమస్యలకు కారణమని తెలుసా? కిడ్నీల రక్షణకు నిపుణులు చెబుతున్న టిప్స్ ఏంటి?
ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మంది కిడ్నీల సమస్యతో బాధపడుతున్నారు. ఈ అంశంపై వైద్య నిపుణులు మాట్లాడుతూ కిడ్నీల సమస్యలకు స్వయం కృతాపరాధమే ఎక్కుువగా కనిపిస్తుందన్నారు. ఎందుకంటే మన అలవాట్లే కిడ్నీల సమస్యకు కారణమవుతుందని పేర్కొన్నారు.

మన శరీర అవయువాల్లో కిడ్నీల ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మన శరీరమంతా ప్రవహించే రక్తాన్ని శుద్ధి చేయడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మంది కిడ్నీల సమస్యతో బాధపడుతున్నారు. ఈ అంశంపై వైద్య నిపుణులు మాట్లాడుతూ కిడ్నీల సమస్యలకు స్వయం కృతాపరాధమే ఎక్కుువగా కనిపిస్తుందన్నారు. ఎందుకంటే మన అలవాట్లే కిడ్నీల సమస్యకు కారణమవుతుందని పేర్కొన్నారు. ఒకవేళ కిడ్నీల సమస్య వచ్చినా జీవనశైలిలో మార్పులు చేసుకోకపోవడం వల్ల ఆ సమస్య మరింత జఠిలం అవుతుందంటున్నారు. అసలు కిడ్నీల సమస్యకు కారణాలేంటో తెలుసుకుందాం.
ఊబకాయం
ప్రస్తుత కాలంలో లింగ భేదంతో సంబంధం లేకుండా అందరూ బాధపడే సమస్య ఊబకాయం. అయితే ఊబకాయం వల్ల మధుమేహం, బీపీ వచ్చే అవకాశం ఎక్కువ. దీంతో ఇతర అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బీఎంఐ ఆడవారిలో 30 శాతం కంటే తక్కువ, మగవారిలో 40 శాతం కంటే ఉండాలి. అలాగే ఒకేచోట కూర్చొని కదలకుండా పని చేస్తే కిడ్నీల సమస్య మరింత తీవ్రమవుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఊబకాయం నుంచి తప్పించుకోవడంతో కిడ్నీల రక్షణకు కూడా ఉపయోగపడుతుంది.
ఉప్పుతో ముప్పు
ప్యాకెజ్డ్ ఆహార పదార్థాల్లో ఎక్కువ శాతం ఉప్పుతో ప్యాక్ చేసి ఉంటుంది. అధిక ఉప్పు వినియోగం కిడ్నీ సమస్యకు కారణమవుతుంది. అలాగే బీపీ పెరిగే అవకాశం ఉంది. ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఉప్పును బాగా తక్కువ తీసుకుంటే మంచిదని నిపుణులు అభిప్రాయం.




ధూమపానం
ధూమపానం చేస్తే కిడ్నీల ఫంక్షన్ బాగా తగ్గిస్తుంది. రక్తనాళలు బాగా సంకోచానికి గురై బీపీ సమస్యలను పెంచుతుంది. అలాగే గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ లకు కారణమవుతుంది. సిగరెట్లలో ఉండే ఆర్సెనిక్, ఫార్మాల్డీహైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి 400 రకాల విష రసాయనాలు ఉంటాయి. ధూమపానం వల్ల శరీరంలో కిడ్నీలే కాకుండా అన్ని అవయవాలు ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ధూమపానాన్ని మానేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
మద్యపానం
మితిమీరిన ఆల్కహాల వినియోగం మూత్రపిండాల పనితీరూప తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఆల్కహాల్ తీసుకుంటే రక్తాన్ని శుద్ధి చేయడానికి కిడ్నీలు ఇబ్బందిపడతాయి. శరీరంలో డీహైడ్రేషన్ కు కారణం కావడంతో పాటు ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు గురవుతుంది.
కిడ్నీల రక్షణకు మార్గాలు
ఆధునిక జీవనశైలి, నిద్రలేమి, ఔషధ దుర్వినియోగం, కల్తీ ఆహారాలు, కాలుష్యం వంటి సమస్యల వల్ల శరీరం ఇబ్బందులకు గురవుతుంది. కిడ్నీల రక్షణకు తప్పనిసరిగా వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వారానికి ఐదు కంటే ఎక్కువ రోజు అరగంటపాటు తేలికపాటి వ్యాయమం చేస్తే ఉత్తమం. అలాకాకుండా వారానికి మూడు కంటే ఎక్కువ రోజులు 20 నిమిషాలపాటు అధికంగా వ్యాయామం చేసినా మంచి ఫలితాలను పొందవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..



