AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kidney Care: అలర్ట్.. ఈ ఐదు అలవాట్లు ఉంటే వెంటనే మానుకోండి.. లేకపోతే, కిడ్నీలకు పెను ప్రమాదమట..!

కిడ్నీలు మూత్రం ద్వారా శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపించి.. మనల్ని ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. అందుకే మంచి ఆరోగ్యం కోసం.. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

Kidney Care: అలర్ట్.. ఈ ఐదు అలవాట్లు ఉంటే వెంటనే మానుకోండి.. లేకపోతే, కిడ్నీలకు పెను ప్రమాదమట..!
Kidney Poblems
Shaik Madar Saheb
|

Updated on: Nov 12, 2022 | 7:00 AM

Share

శరీరంలోని ముఖ్యమైన భాగాలలో కిడ్నీలు ఒకటి. ముత్రపిండాలు ఆరోగ్యంగా లేకపోతే.. ప్రమాదకర సమస్యలు ఉత్పన్నమవుతాయి. కిడ్నీలు మూత్రం ద్వారా శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపించి.. మనల్ని ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. మంచి ఆరోగ్యం కోసం.. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటం అవసరం. ముత్రపిండాలు మొత్తం శరీరంపై చెడు ప్రభావాన్ని చూపకుండా చేస్తాయి. కిడ్నీల్లో ఏదైనా సమస్య ఉంటే కొన్ని విషయాలలో జాగ్రత్త వహించాలి. లేకపోతే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూత్రపిండాలు (కిడ్నీ) ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

  1. ఎక్కువగా నిద్రపోవడం: ఆరోగ్యంగా ఉండటానికి పుష్కలంగా నిద్ర పోవడం అవసరం. కానీ కిడ్నీ రోగులు ఉదయం ఎక్కువసేపు నిద్రపోవడం మంచిది కాదు. ఎందుకంటే ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల.. కిడ్నీల్లోకి మూత్రం ఎక్కువగా చేరుతుంది. దీనివల్ల కిడ్నీలు దెబ్బతింటాయి.
  2. అధిక ఉప్పు తీసుకోవడం: ఉప్పు ఆహారం రుచిని పెంచుతుంది. ఉప్పులో సోడియం అధికమొత్తంలో ఉంటుంది.. ఇది మూత్రపిండాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. మీకు ఏదైనా కిడ్నీ సంబంధిత సమస్య ఉంటే ఉప్పు తీసుకోవడం చాలావరకు తగ్గించాలి. ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు, గుండెపోటు లాంటి సమస్యలు కూడా పెరుగుతాయి.
  3. వైన్ తాగడం: కిడ్నీపై ఆల్కహాల్ చెడు ప్రభావాలను కలిగిస్తుంది. మద్యం తాగేఅలవాటుతోపాటు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నట్లయితే.. వెంటనే దానిని ఆపాలి. మద్యం తాగడం వల్ల కిడ్నీ సమస్యలు మరింత పెరుగుతాయి.
  4. నీరు తక్కువగా తాగడం: కిడ్నీలు శుభ్రం కావాలంటే పుష్కలంగా నీరు తాగడం చాలా ముఖ్యం.. నీరు ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీల్లో వ్యర్థ పదార్థాలు పేరుకుపోవు. తక్కువ నీరు తాగడం వల్ల కిడ్నీలోనే వ్యర్థ పదార్థాలు పేరుకుపోయి.. మూత్ర పిండాలు దెబ్బతింటాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. చురుకుదనం లేకపోవడం: కొంతమంది అనారోగ్యంగా ఉన్నప్పుడు కూర్చుని విశ్రాంతి తీసుకుంటారు. కిడ్నీ సమస్య ఉన్నప్పుడు శరీరం చురుగ్గా ఉండడం చాలా ముఖ్యమని నిపుణులు పేర్కొంటున్నారు. మీ కిడ్నీలో ఏదైనా సమస్య ఉంటే మీరు తేలికపాటి వ్యాయామం లేదా యోగా చేయాలని.. దీనివల్ల శరీరం చురకుగా మారుతుందని పేర్కొంటున్నారు.
  7. పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తినడం: కిడ్నీ పేషెంట్లు పొటాషియం ఎక్కువగా ఉండే వాటిని తినకూడదు. ఇంకా కిడ్నీ సమస్యలు ఉంటే బంగాళదుంపలు, బత్తాయి వంటి వాటిని కూడా తీసుకోకూడదు. అరటిపండ్లు, అవకాడోలు తినడం కూడా కిడ్నీ రోగులకు మంచిది కాదు. ఎందుకంటే వీటిలో పొటాషియం చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది.. ఇది మూత్రపిండాలను దెబ్బతీస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..