Kidney Disease: కిడ్నీ వ్యాధులకు, నోటి దుర్వాసనకు సంబంధం ఏంటి.? నిపుణులు ఏమంటున్నారంటే..
శరీరంలో అంత్యంత ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ప్రధానమైనవి. జీవన క్రియ సవ్యంగా సాగాలంటే కిడ్నీల పనితీరు మెరుగ్గా ఉండాలి. చిక్కుడు గింజ ఆకారంలో ఉండే ఈ అవయవాలు ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రక్తాన్ని శుద్ధి చేసి మూత్రం ద్వారా వ్యర్థాలను..

శరీరంలో అంత్యంత ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ప్రధానమైనవి. జీవన క్రియ సవ్యంగా సాగాలంటే కిడ్నీల పనితీరు మెరుగ్గా ఉండాలి. చిక్కుడు గింజ ఆకారంలో ఉండే ఈ అవయవాలు ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రక్తాన్ని శుద్ధి చేసి మూత్రం ద్వారా వ్యర్థాలను బయటకు పంపించడం కిడ్నీల ముఖ్యమైన విధి. అలాగే హర్మోన్లను ఉత్పత్తి చేయటం, ఖనిజాలను సమతుల్యం చేయటం వంటివి కిడ్నీల బాధ్యత. అయితే తీసుకునే ఆహారం, చెడు అలవాట్ల కారణంగా కిడ్నీల పనితీరులో సమస్యలు మొదలవుతాయి. దీనిద్వారా శరీరంలో ఇతర ఆవయవాలపై ప్రభావం పడుతుంది.
కిడ్నీల పనితీరు మందగించడాన్ని కొన్ని లక్షణాల ఆధారంగా తెలుసుకోవచ్చు. వీటిలో ప్రధానమైనవి మూత్రంలో రంగు మారడం, నురుగు రావడం, కిడ్నీల్లో నొప్పి వంటి ప్రాథమిక లక్షణాల ఆధారంగా పసిగట్టవచ్చు. అయితే నోటి దుర్వాసన కూడా కిడ్నీల వ్యాధులకు ముందస్తు లక్షణమని మీకు తెలుసా.? సహజంగా శరీరం నుంచి విషపదార్థాలను బయటకు పంపించడం కిడ్నీల ప్రాథమిక విధి అని మనందరికీ తెలిసిందే. ఒకవేళ కిడ్నీలు వాటి పనిని సరిగ్గా నిర్వహించకపోతే శరీరంలో చెడు పదార్థాలు పేరుకుపోతాయి. దీంతో నోటి నుంచి దుర్వాసన రావడం ప్రారంభమవుతుంది. దీర్ఘకాలంగా ఈ సమస్య వేధిస్తుంటే కచ్చితంగా కిడ్నీల్లో ఏదో సమస్య ఉందని భావించాలని నిపుణులు చెబుతున్నారు.
నోటి నుంచి దుర్వాసన రావడంతో పాటు చర్మం పొడిబారడం, దురద, కీళ్లు, పాదాల్లో వాపు, బలహీనంగా మారండం, విపరీతమైన అలసట, ఎక్కువగా మూత్రం రావడం వంటివి కూడా కిడ్నీల ఫెయిల్యూర్‌కు లక్షణాలుగా భావించాలి. ఇక కిడ్నీల పనితీరు దెబ్బతినడానికి చాలా రకాల కారణాలు ఉన్నప్పటికీ వాటిలో ప్రధానమైనవి తక్కువగా నీరు తాగడం, ధూమపానం, మద్యం సేవించడం, మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవడం, పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు ఎక్కువగా వాడడం వంటివి కూడా కారణాలు చెప్పవచ్చు.
నోట్: పైన తెలిపిన విషయాలు ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యం విషయంలో ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్య నిపుణులు సలహాలు తీసుకోవడం మంచిది.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..







