Diabetes: చలికాలంలో బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది, ఈ జ్యూస్‌లలో ఒకదాన్ని తీసుకుంటే చాలు
రోజూ ఇలాంటి జ్యూస్‌ని తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. అవేంటో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం-

ప్రస్తుత కాలంలో లక్షలాది మంది మధుమేహం సమస్యతో బాధపడుతున్నారు. డయాబెటిస్‌కు ముఖ్యకారణం అనారోగ్యకరమైన ఆహారం, పేలవమైన జీవనశైలి అని నిపుణులు పేర్కొంటున్నారు. డయాబెటిస్‌లో ఆహారం చాలా త్వరగా ప్రభావితమవుతుంది. ఇందులో షుగర్ లెవెల్ కాస్త పెరిగిన వెంటనే అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. అటువంటి పరిస్థితిలో డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు ఆహారంపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, డయాబెటిస్‌లో కొన్ని పండ్లను తినడం మంచిదే కానీ.. షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్న వాటిని తీసుకుంటే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. డయాబెటిస్ అనేది శరీరాన్ని లోపలి నుండి నెమ్మదిగా నాశనం చేసే వ్యాధి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు చక్కెర నియంత్రణ చాలా ముఖ్యం. రక్తంలో చక్కెర నియంత్రణ లేని కారణంగా ఈ వ్యాధి వస్తుంది. కాబట్టి రక్తంలో చక్కెరను అదుపులో ఉంచే ఆ 5 జ్యూస్‌ల గురించి తెలుసుకోండి.
టమోటా రసం
హెల్త్‌లైన్ నివేదికల ప్రకారం, టమోటాలు తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ఈ కారణంగా డయాబెటిక్ పేషెంట్లకు టొమాటో జ్యూస్ ఉత్తమం.దీని వల్ల శరీరానికి విటమిన్లు, పొటాషియం వంటి పోషకాలు అందుతున్నాయి.
బ్రోకలీ రసం
బ్రోకలీలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బ్రోకలీలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ జ్యూస్‌ని తాగడం వల్ల డయాబెటిస్‌ను నియంత్రించడంలో సహాయపడే ఫైబర్ తగినంత మొత్తంలో లభిస్తుంది. దీనితో పాటు బ్రకోలీ జ్యూస్ తాగడం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది. ఈ రసం మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉత్తమమైనది.
క్యారెట్ రసం
సాధారణంగా ప్రతి ఒక్కరూ చలికాలంలో క్యారెట్ జ్యూస్ తాగాలి. క్యారెట్ ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. క్యారెట్ రసంలో చక్కెర ఎక్కువగా ఉంటుంది, అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని తీసుకోవచ్చు. హెల్త్‌లైన్ ప్రచురించిన నివేదిక ప్రకారం, క్యారెట్ రసం రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహిస్తుంది. క్యారెట్ జ్యూస్‌ని సరైన మొత్తంలో తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు మెయింటెయిన్‌గా ఉంటాయి. అయితే క్యారెట్ జ్యూస్‌ని ఎక్కువగా తాగకూడదు.
దోసకాయ రసం
దోసకాయ రసం శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ లెవెల్ కూడా కంట్రోల్‌లో ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్లు దోసకాయ రసం తాగితే, దాని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీని కోసం మధుమేహ వ్యాధిగ్రస్తులు దోసకాయ రసం తాగాలి. దోసకాయ దోసకాయ చర్మానికి కూడా అనేక విధాలుగా మేలు చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ వారానికి ఒకటి లేదా రెండు సార్లు దోసకాయ రసం తాగాలి.
క్యాబేజీ, యాపిల్ జ్యూస్
ఎవ్రీడే హెల్త్ రిపోర్టుల ప్రకారం క్యాబేజీలో యాంటీ హైపర్గ్లైసీమిక్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. అలాగే ఇందులో ఉండే విటమిన్ సి వంటి అంశాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అందువల్ల క్యాబేజీ, యాపిల్ జ్యూస్ తాగితే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం