చలికాలంలో కూడా రాత్రిపూట చెమట పట్టుతుందా..? ప్రాణాంతక వ్యాధుల సంకేతం కావొచ్చు.. బీకేర్‌ఫుల్
చలికాలపు రాత్రులలో, అందరూ మెత్తని బొంత వెచ్చదనాన్ని ఆస్వాదిస్తుంటారు.. కానీ.. కొంతమంది చెమటతో తడిసి ముద్దవుతుంటారు.. వారికి నిద్ర కూడా సరిగా ఉండదు.. వేసవిలో అయితే సాధారణం కానీ.. చలికాలంలో ఇలా పదే పదే జరుగుతుంటే తేలిగ్గా తీసుకోవడం సరికాదంటున్నారు వైద్య నిపుణులు..

చలికాలం ప్రారంభమైంది.. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.. దీంతో అందరూ తీవ్రమైన చలికి వణికిపోతున్నారు.. వాస్తవానికి, చలికాలపు రాత్రులలో అందరూ మెత్తని బొంత, రగ్గులు కప్పుకుని వెచ్చదనాన్ని ఆస్వాదిస్తుంటారు.. అయితే.. కొందరు చెమటతో తడిసి మేల్కొంటారు. ఎంత చల్లగా ఉన్నా రాత్రిపూట చెమట ఎక్కువగా పడుతుంది.. ఇలా పదే పదే జరుగుతుంటే తేలిగ్గా తీసుకోవడం సరికాదంటున్నారు వైద్య నిపుణులు.. చల్లని వాతావరణంలో రాత్రిపూట చెమటలు పట్టడం అనేది కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సంకేతమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చలిలో కూడా రాత్రి చెమటలు పట్టడం వెనుక అనేక కారణాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అత్యంత సాధారణ కారణాలు హార్మోన్ల అసమతుల్యత, ఇన్ఫెక్షన్ లేదా చాలా వెచ్చని బట్టలు ధరించడం.. కానీ ఈ సమస్య నిరంతరం కొనసాగితే, ఇది కొన్ని తీవ్రమైన వ్యాధుల లక్షణం కావచ్చు. అవేంటో తెలుసుకోండి..
TB (క్షయవ్యాధి): TB ప్రారంభ లక్షణాలు రాత్రిపూట చెమటలు పట్టడం. ఈ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. సమయానికి చికిత్స చేయకపోతే ప్రమాదకరంగా మారుతుంది.
హాడ్జికిన్స్ లింఫోమా క్యాన్సర్: అనేది శోషరస కణుపులను ప్రభావితం చేసే ఒక రకమైన క్యాన్సర్. దీని లక్షణాలు రాత్రి చెమటలు, బరువు తగ్గడం, జ్వరం లాంటివి కనిపిస్తాయి.
హైపర్ థైరాయిడిజం: థైరాయిడ్ గ్రంధి అతిగా పనిచేసినప్పుడు కూడా రాత్రిపూట చెమటలు పట్టవచ్చు. ఈ పరిస్థితి హృదయ స్పందన రేటును పెంచుతుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సమస్యలను కలిగిస్తుంది.
మెనోపాజ్ లేదా హార్మోన్ల మార్పులు: మహిళల్లో రుతువిరతి సమయంలో హార్మోన్ల మార్పులు చలిలో కూడా చెమటలు పట్టేలా చేస్తాయి.
గుండె సంబంధిత సమస్యలు: రాత్రిపూట చెమటలు పట్టడం గుండెపోటు వంటి గుండె సమస్యలకు సంకేతం.. ఇలా తరచూ కొనసాగుతుంటే.. దీనిని నిర్లక్ష్యం చేయకూడదు..
ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి?
మీరు చలి సమయంలో రాత్రిపూట పదేపదే చెమటలు పడుతూ ఉంటే, దానిని నిర్లక్ష్యం చేయవద్దు. వైద్యుడిని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోండి.
ఇది కాకుండా, సమతుల్య ఆహారం తీసుకోండి.. తగినంత నీరు త్రాగండి.. హైడ్రెట్ గా ఉండండి.. ఒత్తిడిని తగ్గించడానికి యోగా లేదా ధ్యానం సహాయం తీసుకోండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




