Heart Attack Symptoms: ఈ లక్షణాలు గుండెపోటుకు సంకేతాలు.. వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
గుండె.. మన శరీరంలోని అతి ముఖ్యమైన భాగం. గుండె ఆరోగ్యం బాగుంటేనే.. మనం పదికాలాల పాటు పదిలంగా ఉండగలం.
గుండె.. మన శరీరంలోని అతి ముఖ్యమైన భాగం. గుండె ఆరోగ్యం బాగుంటేనే.. మనం పదికాలాల పాటు పదిలంగా ఉండగలం. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది గుండెపోటు బారిన పడుతున్నారు. జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లలో మార్పులు చేర్పులే ఇందుకు కారణం అవుతోంది. ఈ క్రమంలోనే ఎలప్పుడూ గుండెను పదిలంగా కాపాడుకోవాలని వైద్యులు చెబుతుంటారు. మరి గుండెను ఎప్పుడూ ఆరోగ్యకరంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి..?
శరీరంలోని అన్ని భాగాలకు గుండె.. రక్తాన్ని సరఫరా చేయడమే కాదు.. ఆక్సిజన్‌ను కూడా అందిస్తుంది. ఏమాత్రం గుండె దెబ్బతిన్నా.. అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇదిలా ఉంటే.. గుండెకు సంబంధించి ఎలాంటి లక్షణాన్ని అయినా నిర్లక్ష్యం చేయకూడదని డాక్టర్లు అంటున్నారు. ముఖ్యంగా మీకు తరచూ గుండెలో నొప్పి, మంట వస్తుంటే.. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. అలాగే అధిక రక్తపోటు సమస్య కూడా హార్ట్ ఎటాక్ రావడానికి ప్రధాన లక్షణం. అందుకే దీనిని సైతం అస్సలు నిరక్ష్యం చేయొద్దు.
గుండె ఆరోగ్యానికి ఈ ఆహారాలను మీ డైట్‌లో చేర్చండి..
గుండె జబ్బులు, హృదయ రుగ్మతుల వంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఈ ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్‌బెర్రీస్, రాస్ప్‌బెర్రీస్, వాల్‌నట్‌లు, ఆలివ్ ఆయిల్, చేపలు, ఆకుకూరలు, హోల్ గ్రెయిన్స్, అవకాడో, ఫ్యాటీ ఫిష్, బీన్స్, డార్క్ చాక్లెట్, టమాటాలు, బాదాం, వెల్లుల్లి, చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం..