Heart Stroke: గుండెపోటులో 2 రకాలు.. మినీ స్ట్రోక్ vs రెగ్యులర్ స్ట్రోక్.. అంటే ఏంటో తెలుసుకోండి..

|

Nov 09, 2021 | 3:54 PM

Heart Stroke: గుండెపోటు అకాల మరణానికి దారి తీస్తుంది. లక్ష మందిలో 119 నుంచి 145 మందికి స్ట్రోక్‌ వస్తోందని ఆరోగ్య నిపుణులు అంచనా వేశారు. కొన్నిసార్లు స్ట్రోక్

Heart Stroke: గుండెపోటులో 2 రకాలు.. మినీ స్ట్రోక్ vs రెగ్యులర్ స్ట్రోక్.. అంటే ఏంటో తెలుసుకోండి..
Mini Stroke
Follow us on

Heart Stroke: గుండెపోటు అకాల మరణానికి దారి తీస్తుంది. లక్ష మందిలో 119 నుంచి 145 మందికి స్ట్రోక్‌ వస్తోందని ఆరోగ్య నిపుణులు అంచనా వేశారు. కొన్నిసార్లు స్ట్రోక్ లక్షణాలను గమనించకపోవడం వల్ల గుండెపోటుకి గురవుతాము. అయితే హార్ట్‌ స్ట్రోక్‌లో 2 రకాలు ఉంటాయి. అందులో ఒకటి ట్రాన్సియెంట్ ఇస్కీమిక్ అటాక్ (TIA) లేదా మినీ స్ట్రోక్. రెండోది రెగ్యులర్‌ స్ట్రోక్‌. అయితే మినీ స్ట్రోక్‌ వచ్చిన వారిలో దాదాపు 33 శాతం మంది చికిత్స తీసుకున్నప్పటికీ సంవత్సరంలోపు పెద్ద స్ట్రోక్ వస్తుంది.

మినీ స్ట్రోక్ 
మెదడుకి రక్త ప్రవాహం కొద్దిసేపు (5 నిమిషాల కంటే తక్కువ) ఆగిపోయినప్పుడు ఈ స్ట్రోక్‌ ఏర్పడుతుంది. దీనినే TIA అంటారు. TIAని మినీ-స్ట్రోక్ అని కూడా పిలుస్తారు. దీనిని రెగ్యులర్ స్ట్రోక్ సంకేతంగా చెప్పవచ్చు. ఇది తక్కువ నష్టాన్ని కలిగిస్తుంది కానీ ఆలస్యం చేయకుండా అత్యవసర సంరక్షణ అవసరం. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ధమని బ్లాక్ అయినప్పుడు TIA ఏర్పడుతుంది. అయితే వెంటనే మెదడుకు రక్త ప్రవాహం త్వరగా తిరిగి వస్తుంది. TIA లక్షణాలు సాధారణంగా ఒక గంటలోపు తగ్గుతాయి కానీ కొన్ని సందర్భాల్లో 24 గంటల వరకు ఉండవచ్చు.

మినీ స్ట్రోక్ కారణాలు..
సాధారణంగా పురుషుల కంటే స్త్రీలకు మినీ స్ట్రోక్‌ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఊబకాయం, కరోటిడ్ ధమని వ్యాధి, అధిక BP, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, ఇతర ఆరోగ్య పరిస్థితుల కారణంగా మినీ స్ట్రోక్ ఏర్పడుతుంది. అధిక ధూమపానం, మద్యపానం, కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న ఆహారాలు తినడం, యాంఫేటమిన్లు, కొకైన్, హెరాయిన్ వంటి మాదకద్రవ్యాలను ఉపయోగించడం వల్ల కూడా ఈ ప్రమాదాన్ని పెంచుతాయి.

Hair Care Tips: జుట్టు రాలడానికి కొన్ని కారణాలున్నాయి.. కానీ అందులో అపోహలు, వాస్తవాలు తెలుసుకోండి..

AP PG Cet 2021: ఏపీ పీజీ సెట్ ఫలితాలను రిలీజ్ చేసిన మంత్రి సురేష్.. అర్హత సాధించిన 24వేల మంది స్టూడెంట్స్

Cochin Shipyard Recruitment: కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తులకు రేపే చివరి తేదీ..