Lumpy Skin Disease: పంజాబ్‌లో తగ్గిన పాల ఉత్పత్తి.. పశువులకు కొత్త వ్యాధి..
Lumpy Skin Disease: పాలు పితికే జంతువులలో లంపి స్కిన్ డిసీజ్ వ్యాప్తి చెందడంతో పంజాబ్‌లోని పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యాధి కారణంగా..
Lumpy Skin Disease: పాలు పితికే జంతువులలో లంపి స్కిన్ డిసీజ్ వ్యాప్తి చెందడంతో పంజాబ్‌లోని పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యాధి కారణంగా రాష్ట్రంలో పాల ఉత్పత్తి 15 నుంచి 20 శాతం తగ్గిందని రాష్ట్ర ప్రగతిశీల పాడి రైతుల సంఘం (పీడీఎఫ్‌ఏ) పేర్కొంది. ఈ అంటు వ్యాధి ముఖ్యంగా పశువులలో ఆవులలో వ్యాపిస్తుంది.
1.26 లక్షల పశువులు దెబ్బతిన్నాయని, పశువులపై పూర్తిగా ఆధారపడి జీవిస్తున్న రైతులు తీవ్రంగా నష్టపోయారని పీడీఎఫ్‌ఏ తెలిపింది. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అందించిన సమాచారం ప్రకారం.. 1.26 లక్షల పశువులు ఈ వ్యాధి బారిన పడ్డాయి. ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు 10 వేలకు పైగా పశువులు ప్రాణాలు కోల్పోయాయి. లంపి చర్మవ్యాధి కారణంగా పంజాబ్‌లో ఇప్పటివరకు లక్షకుపైగా పశువులు మరణించాయని పిడిఎఫ్‌ఎ పేర్కొంది.
ఫజిల్కా, ఫరీద్‌కోట్, బటిండా, టార్న్ తరణ్ ఈ వ్యాధి బారిన పడిన రాష్ట్రంలోని ప్రధాన జిల్లాలలో పాల ఉత్పత్తిలో 15 నుండి 20 శాతం తగ్గుదల ఉంది. పిడిఎఫ్‌ఎ అధ్యక్షుడు దల్జిత్ సింగ్ సదర్‌పురా మాట్లాడుతూ.. లంపి చర్మవ్యాధి కారణంగా పంజాబ్‌లో పాల ఉత్పత్తి 15 నుండి 20 శాతం తగ్గిందని అన్నారు. దీనితో పాటు ఆవుల సగటు పాల ఉత్పత్తి కూడా ఒక సంవత్సరం పాటు తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.
పాకిస్థాన్ నుంచి వచ్చిన..
లంపి చర్మ వ్యాధి కారణంగా గత మూడు నెలల్లో లక్షలాది పశువులు చనిపోయాయి. పాకిస్తాన్ మీదుగా భారతదేశంలోకి ప్రవేశించిన ఈ ప్రమాదకరమైన అంటువ్యాధి జంతువుల మరణానికి కారణమవుతోంది. పాకిస్తాన్‌లోని సింధ్, బహవల్‌నగర్ ద్వారా లంపీ వ్యాధి భారతదేశంలోకి ప్రవేశించింది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి