Health Problems: మీరు రాత్రుల్లో రెండు సార్లకంటే ఎక్కువ మూత్రానికి వెళ్తున్నారా..? ఈ సమస్య కావచ్చు.. జాగ్రత్త!

Health Problems: మూత్రం విపరీతంగా వచ్చే సమస్య ఉన్నవారికి రాత్రిపూట కూడా మూత్రం వస్తుంది. ఈ సమస్య రెండుసార్లకు మించి ఎక్కువ వెళ్లినట్లయితే..

Health Problems: మీరు రాత్రుల్లో రెండు సార్లకంటే ఎక్కువ మూత్రానికి వెళ్తున్నారా..? ఈ సమస్య కావచ్చు.. జాగ్రత్త!
Health Problems
Follow us

|

Updated on: Aug 29, 2022 | 9:33 AM

Health Problems: మూత్రం విపరీతంగా వచ్చే సమస్య ఉన్నవారికి రాత్రిపూట కూడా మూత్రం వస్తుంది. ఈ సమస్య రెండుసార్లకు మించి ఎక్కువ వెళ్లినట్లయితే అప్రమత్తంగా ఉండాలి. ఈ సమస్య వెనుక ఏ వ్యాధులు లేదా ఆరోగ్య సమస్యలు కారణం కావచ్చంటున్నారు వైద్య నిపుణులు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాత్రిపూట రెండుసార్లు కంటే ఎక్కువ మూత్ర విసర్జన చేసే వ్యక్తులు నోక్టురియా బాధితులు. నిద్రపోతున్నప్పుడు శరీరంలో మూత్రం ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. దీని కారణంగా మనం చాలా గంటలు నిరంతరం నిద్రపోగలుగుతున్నాము. కానీ రాత్రిపూట మూత్రం ఎక్కువగా వస్తుంటే మీకు నోక్టురియా సమస్య ఉండవచ్చని భావించాలి. దీని వెనుక అనేక ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. మధుమేహం అంటే వారికి ఈ రకమైన సమస్య ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుందని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. శరీరంలో షుగర్ లెవెల్ అదుపు తప్పితే ఇలా జరుగుతుంది.

అలాగే కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉంటే అప్పుడు కూడా ఎక్కువగా మూత్రం వచ్చే అవకాశాలున్నాయి. అలాగే కిడ్నీలు సరిగ్గా పని చేయని కారణంగా కూడా ఎక్కువ మూత్రం వస్తుందని చెబుతున్నారు నిపుణులు. న్యూరోలాజికల్ డిజార్డర్ ఉన్నా ఎక్కువగా మూత్రం వచ్చే సమస్య ఉంటుంది. ఇలా సమస్య ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స చేసుకోవడం ముఖ్యం.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి