AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ 10 వ్యాధులే లక్షలాది మంది ప్రాణాలు తీస్తున్నాయి.. ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ అంటే ఏంటో తెలుసా?

వ్యాధులను నివారించడం కష్టం కానీ.. అసాధ్యం కాదు. అందువల్ల.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.. అయితే.. కొంతకాలంలో ప్రమాదకరమైన వ్యాధులు విజృంభిస్తున్నాయి. అధిక మరణాలకు ముఖ్యంగా 10 వ్యాధులు కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది..

ఈ 10 వ్యాధులే లక్షలాది మంది ప్రాణాలు తీస్తున్నాయి.. ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ అంటే ఏంటో తెలుసా?
Heart Disease
Shaik Madar Saheb
|

Updated on: Aug 10, 2024 | 10:46 AM

Share

వ్యాధులను నివారించడం కష్టం కానీ.. అసాధ్యం కాదు. అందువల్ల.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.. అయితే.. కొంతకాలంలో ప్రమాదకరమైన వ్యాధులు విజృంభిస్తున్నాయి. అధిక మరణాలకు ముఖ్యంగా 10 వ్యాధులు కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాల వ్యాధుల జాబితాను విడుదల చేసింది.. ఇందులో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు బయటపడ్డాయి. నివేదిక ప్రకారం, 2021లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 68 మిలియన్ల మరణాలలో 57% ఈ 10 వ్యాధుల కారణంగా సంభవించాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది..

వీటిలో ప్రధాన కారణం ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్.. ఇది ప్రపంచవ్యాప్తంగా 13 శాతం మరణాలకు కారణం. 2000 సంవత్సరం నుంచి ఈ వ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య 27 లక్షలకు పెరిగింది.. 2021 సంవత్సరంలో ఈ వ్యాధి కారణంగా 91 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ కారణంగా కేవలం 8 లక్షల మరణాలు మాత్రమే సంభవించాయి. గుండెపోటు లేదా ఇస్కీమిక్ గుండె జబ్బులు కరోనా వైరస్ కంటే ఎక్కువ మందిని చంపుతున్నాయి..

10 అత్యంత ప్రాణాంతక వ్యాధులు

  • ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్
  • కోవిడ్ 19
  • స్ట్రోక్
  • COPD -క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్
  • లంగ్ క్యాన్సర్
  • అల్జీమర్స్
  • డయాబెటిస్
  • కిడ్నీ డిసీజ్
  • టీబీ

ఇస్కీమిక్ గుండె జబ్బు అంటే ఏమిటి?

ఇస్కీమిక్ గుండె జబ్బులో, రక్త ప్రసరణ లేకపోవడం వల్ల గుండె బలహీనంగా మారుతుంది. ఇది సాధారణంగా కొలెస్ట్రాల్ తీవ్రంగా పెరిగిన సందర్భంలో కనిపిస్తుంది.. సిరల్లో ఫలకం పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణ సరిగా జరగదు. దీనితో బాధపడుతున్న వ్యక్తి ఛాతీ నొప్పి నుండి గుండెపోటు వరకు లక్షణాలను అనుభవించవచ్చు. దీని చికిత్సలో మందులు, యాంజియోప్లాస్టీ, శస్త్రచికిత్స, జీవనశైలిలో అవసరమైన మార్పులు ఉంటాయి.

హృదయాన్ని బలంగా ఉంచే మార్గాలు..

గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి, ఆహారంతో పాటు వ్యాయామం చాలా ముఖ్యం. మీరు ఎప్పుడూ గుండె జబ్బుల బారిన పడకూడదనుకుంటే, ప్రతిరోజూ 10-15 నిమిషాలు శారీరక శ్రమ చేయండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..