AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: ఈ చిట్కాలు పాటించండి.. మదుమేహనికి చెక్ పెట్టేయండి..

నేటి ఆధునిక కాలంలో చాలా మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ముఖ్యంగా జీవనశైలిలో వస్తున్న మార్పులే ఈవ్యాధికి కారణమని ఎంతో మంది వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ధ తీసుకోకపొవడం, తినే ఆహారంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే చిన్న వయసులోనే..

Diabetes: ఈ చిట్కాలు పాటించండి.. మదుమేహనికి చెక్ పెట్టేయండి..
Diabetes
Amarnadh Daneti
|

Updated on: Sep 25, 2022 | 1:33 PM

Share

Diabetes: నేటి ఆధునిక కాలంలో చాలా మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ముఖ్యంగా జీవనశైలిలో వస్తున్న మార్పులే ఈవ్యాధికి కారణమని ఎంతో మంది వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ధ తీసుకోకపొవడం, తినే ఆహారంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే చిన్న వయసులోనే చాలా మంది మధుమేహం వ్యాధి బారిన పడుతున్నారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే షుగర్ వ్యాధికి చెక్ పెట్టవచ్చంటున్నారు వైద్య నిపుణులు. వ్యక్తి ఆరోగ్యంగా ఉండేందుకు వాకింగ్ దోహదపడుతుంది. అలాగే వాకింగ్ చేయడం ద్వారా శరీరంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. నడక ద్వారా మధుమేహనికి అడ్డుకట్ట వేయవచ్చని చెబుతున్నారు. వాకింగ్ ద్వారా రక్తంలోని చక్కెరను నియంత్రించడమే కాకుండా మధుమేహం వల్ల వచ్చే ఇతర ఇబ్బందులను కూడా తగ్గిస్తుంది. మధుమేహం ఆకస్మికంగా వచ్చే వ్యాధి కాదు. క్రమంగా ఈ వ్యాధి శరీరంలో పెరుగుతూ ఉంటుంది. డయాబెటిస్ లక్షణాలు కనిపించిన వెంటనే జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది . దీని కోసం ఖరీదైన మందులు తీసుకోవలసిన అవసరం లేదు. రోజువారీ జీవనశైలి, ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మధుమేహాన్ని కంట్రోల్ చేయవచ్చు. తినే ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించవచ్చు. ఉదయం పూట కొన్ని వ్యాయామాలు చేయాలని, అలా చేయడం ద్వారా శరీరంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుందంటున్నారు నిపుణులు. మధుమేహం వ్యాధిని కంట్రోల్ ఉంచడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం.

మార్నింగ్ వాకింగ్: వాకింగ్ తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయాన్నే వాకింగ్ చేయడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. నడక రక్తంలోని చక్కెరను నియంత్రించడమే కాకుండా మధుమేహం వల్ల వచ్చే ఇతర ఇబ్బందులను నివారిస్తుంది. ఇప్పటికే మధుమేహం వ్యాధి ఉన్న వారు రోజు ఉదయం వాకింగ్ చేయడం వల్ల వ్యాధి మరింత ఎక్కువ కాకుండా చూసుకోవచ్చు. ఉదయం పూట కనీసం 20 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే కచ్చితంగా ప్రయోజనం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఏరోబిక్స్: మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయాన్నే ఏరోబిక్స్ చేస్తే ఆరోగ్యానికి మంచిది. ప్రతిరోజూ ఉదయం కనీసం 30 నిమిషాలు, వారానికి కనీసం ఐదు రోజులు ఏరోబిక్ డ్యాన్స్ చేస్తే మంచిది. ఇలా చేయడం ద్వారా మధుమేహం ఉన్న వ్యక్తిలో సానుకూల మార్పును చూపుతుంది.

ఇవి కూడా చదవండి

సైక్లింగ్: వ్యాయామంలో సైక్లింగ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఉదయం పూట కనీసం 20 నిమిషాల పాటు సైకిల్ తొక్కడం వల్ల చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. అనేక ఇతర రుగ్మతలను కూడా నయం చేస్తుంది.

ప్రాణాయామం: ప్రతిరోజూ ఉదయం 10 నుంచి 15 నిమిషాలు ప్రాణాయామం, శ్వాస వ్యాయామం చేయడం ద్వారా మధుమేహాన్ని కంట్రోల్ లో ఉంచుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

(ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ పాఠకుల ఆసక్తిని అనుసరించి ఇచ్చింది. TV9 తెలుగు వీటిని ధృవీకరించలేదు. నిపుణులను సంప్రదించిన తర్వాత మాత్రమే దీన్ని అనుసరించండి.)

Follow Us
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..