AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: కిడ్నీ ఫెయిల్యూర్ సంకేతాలు… ముందస్తుగా తెలుసుకోండి

శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు కూడా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 840 మంది మిలియన్ల (84 కోట్లు) మంది దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కిడ్నీలు పనితీరు మందగించినప్పుడు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి..

Health: కిడ్నీ ఫెయిల్యూర్ సంకేతాలు... ముందస్తుగా తెలుసుకోండి
Kidney Problems
Ram Naramaneni
|

Updated on: Aug 01, 2024 | 1:42 PM

Share

కిడ్నీలు మన శరీరంలో కీ రోల్ పోషిస్తాయి. ఇవి రోజంతా నాన్ స్టాప్ వర్క్ చేస్తూనే ఉంటాయి. మన శరీరం నుండి మలినాలను ఫిల్టర్ చేయడానికి, వాటిని మూత్రం ద్వారా విసర్జించేలా చేయడం కిడ్నీల మెయిన్ టాస్క్. కిడ్నీ పనితీరు క్షీణించి, బాడీలోని టాక్సిన్ల తొలగింపు విధులు సక్రమంగా నిర్వహించలేనప్పుడు మాత్రమే పలు రకాల కిడ్నీ వ్యాధులు అటాక్ చేసే అవకాశం ఉంటుంది. అయితే కిడ్నీ పనితీరు 90% తగ్గేవరకు లక్షణాలు కనపడకపోవచ్చు.  కిడ్నీ పనితీరు గణనీయంగా తగ్గిన తర్వాతే ఎక్కువగా లక్షణాలు కనపడతాయి. ఇది కిడ్నీ వ్యాధులను ప్రారంభ దశలో గుర్తించడం కష్టతరం చేస్తుంది.  కిడ్నీ పనితీరు తగ్గినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఏంటో..  ప్రముఖ నెఫ్రాలజిస్ట్.. పీఎస్ వలీ వివరించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం….

1. కాళ్లు, ముఖం ఉబ్బడం: కిడ్నీలు సరిగ్గా ఫిల్టర్ చేయకపోతే, శరీరంలో ద్రవం నిల్వ అవడం వల్ల కాళ్లు, ముఖం శరీరంలోని ఇతర భాగాలు ఉబ్బుతాయి.

2.  చిన్న వయసులో హై బీపీ రావడం: చిన్న వయసులోనే రక్తపోటు పెరగడం కిడ్నీ సమస్యలకు సంకేతం కావచ్చు. కిడ్నీలు రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

3.  రాత్రిపూట యూరిన్ కోసం ఎక్కువ సార్లు లేవడం: రాత్రిపూట ఎక్కువ సార్లు మలమూత్రాల కోసం లేవడం కూడా కిడ్నీ పనితీరు తగ్గిన సంకేతం కావచ్చు.

4.  యూరిన్‌లో రక్తం లేదా కోలా కలర్: యూరిన్‌లో రక్తం కనిపించడం లేదా యూరిన్ రంగు మారి కాఫీ రంగులో రావడం కిడ్నీ సమస్యలకు సంకేతం కావచ్చు.

5. శరీరంలో ద్రవం నిల్వ అవడం వల్ల శ్వాస సమస్యలు: కిడ్నీ పనితీరు తగ్గినప్పుడు శరీరంలో ద్రవం నిల్వ అవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావచ్చు.

6.  వాంతులు, అన్నం అస్సలు సహించకపోవడం, శరీరంలో దురద: కిడ్నీలు సరిగా పని చేయకపోతే, శరీరంలో విషపదార్థాలు పేరుకుపోయి వాంతులు, అన్నం తినడంలో ఇబ్బంది, మరియు శరీరంలో దురద రావడం సాధారణం.

పై లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కిడ్నీ ఆరోగ్యాన్ని నిరంతరం పరిశీలించి, తగిన పరీక్షలు చేయించడం ద్వారా కిడ్నీ వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కిడ్నీ పనితీరు మెరుగుపరచుకోవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..