AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే సబ్బుతో అందరూ స్నానం చేస్తున్నారా..? అయితే జాగ్రత్త మరి.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?

ఇంట్లో అందరూ ఒకే సబ్బును వాడడం ఓ సాధారణ అలవాటు. కానీ ఇది ఆరోగ్యానికి ఎంతవరకు సురక్షితం అనేది చాలా మందికి తెలియదు. ఈ అలవాటుతో చర్మవ్యాధులు, బ్యాక్టీరియా ఇన్‌ ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఉంది. అలాంటి ప్రమాదాల నుంచి దూరంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం.

ఒకే సబ్బుతో అందరూ స్నానం చేస్తున్నారా..? అయితే జాగ్రత్త మరి.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?
Sharing Soap With Family
Prashanthi V
|

Updated on: Jul 27, 2025 | 9:47 PM

Share

ఇంట్లో అందరూ ఒకే సబ్బును వాడటం చాలా మందికి ఇప్పటికీ అలవాటు. కానీ అది ఆరోగ్యపరంగా ఎంతవరకు సురక్షితం అనేది చాలా మందికి తెలియదు. ఒకే సబ్బును కలిసి వాడటం వల్ల కలిగే ప్రమాదాలు వాటి నివారణ మార్గాలను తెలుసుకోవడం ఇప్పుడు చాలా అవసరం.

పాతకాలపు అలవాటు.. ఇప్పటికీ మంచిదేనా..?

మునుపటి కాలాల్లో ప్రతి ఇంట్లో ఒకే సబ్బు ఉండేది. అందరూ అదే వాడేవారు. అది అప్పట్లో పెద్ద విషయంగా కనిపించేది కాదు. కానీ ఇప్పుడు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాముఖ్యత పెరిగింది. అందుకే ప్రతి ఒక్కరూ తమ చర్మానికి తగిన సబ్బును వాడటం మొదలుపెట్టారు. ఇది మంచి పద్ధతే. ఎందుకంటే ప్రతి ఒక్కరి చర్మం ప్రత్యేకంగా ఉండటం వల్ల.. అందరికీ ఒకే సబ్బు సెట్ అవ్వదు.

ఒకే సబ్బుతో ఆరోగ్య సమస్యలు

ఒకరి సబ్బుకు ఉండే క్రిములు లేదా చర్మ సంబంధిత ఇన్‌ఫెక్షన్లు ఆ సబ్బు ద్వారా ఇతరులకు వ్యాపించవచ్చు. సబ్బులో ఉండే తడి నురుగు సహజంగా బ్యాక్టీరియా పెరగడానికి అనువుగా ఉంటుంది. అంతే కాదు చాలా మంది సబ్బును వాడాక బాగా కడగకుండా వదిలేస్తారు. దీని వలన మిగతా వారికి ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. సబ్బును బాగా కడిగి ఆరబెట్టి వాడితే ఈ ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించవచ్చు.

చర్మానికి నష్టం

చర్మం సున్నితంగా ఉండే వారికి.. ఇతర చర్మవ్యాధులు ఉన్న వారికి ఒకే సబ్బు వాడటం వల్ల ఇన్‌ఫెక్షన్లు రావడం చాలా కామన్. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలు లేదా వృద్ధులకు ఇది హానికరం కావచ్చు. వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తుల నుంచి సబ్బు ద్వారా ఇతరులకు వ్యాధులు వ్యాపించవచ్చు.

లిక్విడ్ సోప్

సాధారణ సబ్బు కంటే లిక్విడ్ సోప్ పరిశుభ్రత పరంగా ఎంతో ఉత్తమంగా భావించబడుతుంది. ఒక్కొక్కరికి వేర్వేరు బాటిళ్లలో ఉండేలా లిక్విడ్ సోప్ తీసుకుంటే సబ్బు ద్వారా వ్యాపించే ఇన్‌ఫెక్షన్లకు అవకాశం ఉండదు. అందుకే ఆరోగ్య నిపుణులు కూడా ఈ తరహా ద్రవ సబ్బుల వాడకాన్ని సూచిస్తున్నారు. ఇలా చేస్తే కుటుంబ సభ్యుల మధ్య వ్యాధుల వ్యాప్తిని ఆపవచ్చు.

సబ్బు వాడకంలో జాగ్రత్తలు

సబ్బు అనేది శరీరాన్ని శుభ్రంగా ఉంచేందుకు మాత్రమే.. కానీ ఆరోగ్యానికి హాని కలిగించేలా వాడితే ప్రయోజనం ఉండదు. ఒకే సబ్బును అందరూ వాడటం తప్పని పరిస్థితిలో.. ప్రతిసారి వాడిన తర్వాత సబ్బును పూర్తిగా కడిగి ఆరబెట్టి ఉంచాలి. సబ్బును నేరుగా శరీరానికి రాయకుండా చేతిలో నురుగు చేసి ఉపయోగించాలి. మీరు చర్మ సమస్యలతో బాధపడుతున్నట్లయితే.. తప్పకుండా వైద్యుని సలహా తీసుకొని చర్మానికి అనుకూలమైన సబ్బును ఎంచుకోండి.