Health: బీరు తాగితే కిడ్నీలో రాళ్లు పోతాయా.? నిపుణులు ఏమంటున్నారంటే..
మారుతోన్న జీవనశైలి, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు కారణంగా ఇటీవల కిడ్నీల్లో రాళ్ల సమస్య పెరుగుతోంది. సరిగ్గా నీరు తీసుకోకపోవడం, కొన్ని రకాల ఆహారాల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడుతాయి. అయితే కిడ్నీల్లో రాళ్లు తొలగించడానికి వైద్య పరంగా ఎన్నో పరిష్కార మార్గాలు ఉన్నాయి. అయితే బీరు తాగడం వల్ల కిడ్నీలో ఉండే రాళ్లు తొలగిపోతాయనే ఒక నమ్మకం ప్రజల్లో...

ఆరోగ్యం విషయంలో ఎన్నో అపోహలు ఉంటాయి. సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఆరోగ్యానికి సంబంధించిన అపోహలు మరింత పెరుగుతున్నాయి. ఎవరికి తోచిన సలహాలు వాళ్లు నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటివి నిజమేనని చాలా మంది నమ్ముతున్నారు కూడా. ఇలాంటి నమ్మకాల్లో బీరు తాగితే కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయనేది ఒక నమ్మకం. నిజంగానే బీరు తాగితే కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయా.? ఇందులో నిజమెంత.? ఉందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే…
మారుతోన్న జీవనశైలి, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు కారణంగా ఇటీవల కిడ్నీల్లో రాళ్ల సమస్య పెరుగుతోంది. సరిగ్గా నీరు తీసుకోకపోవడం, కొన్ని రకాల ఆహారాల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడుతాయి. అయితే కిడ్నీల్లో రాళ్లు తొలగించడానికి వైద్య పరంగా ఎన్నో పరిష్కార మార్గాలు ఉన్నాయి. అయితే బీరు తాగడం వల్ల కిడ్నీలో ఉండే రాళ్లు తొలగిపోతాయనే ఒక నమ్మకం ప్రజల్లో బాగా ఉంది. కిడ్నీల్లో పలు రకాల పదార్థాలు పేరుకుపోవడం వల్ల రాళ్లు ఏర్పడతాయనే విషయం తెలిసిందే. ఎక్కువ నీరు తాగకపోవడం వల్లే ఈ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇక బీరు తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు పోతాయనడంలో ఎలాంటి ఆధారాలు లేవని వైద్యులు చెబుతున్నారు. ఢిల్లీకి చెందిన సీనియర్ వైద్యుడు డాక్టర్ కమల్‌జిత్ సింగ్ కౌంత్ ఈ విషయం మాట్లాడుతూ.. బీరు తాగితే రాళ్లు పోతాయనేది అపోహ మాత్రమేనని తేల్చి చెప్పారు. అయితే కిడ్నీ స్టోన్ పరిమాణం 6 మి.మీ కంటే తక్కువ ఉంటే.. మంచి నీరు బాగా తాగడం వల్ల తొలగిపోతుందని. అంతకు మించి పరిమాణం ఉంటే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. అయితే చాలా మంది బీరు తాగడం వల్ల లిక్విడ్ డైట్ పెరుగుతుందని, దీంతో మూత్రం నుంచి రాళ్లు బయటకు వస్తాయనే అపోహలో ఉన్నారని చెబుతున్నారు.
బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు తోలగిపోతాయనేది పెద్ద అపార్థం మాత్రమేనని వైద్యులు చెబుతున్నారు. బీర్ లేదా ఆల్కల్ మూత్ర ఉత్పత్తి పెంచుతుండొచ్చు కానీ, రాళ్లు పోతాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ పెరగడం తప్ప ఎలాంటి లాభం ఉండదని చెబుతున్నారు. కాబట్టి రాళ్లు తొలగిపోవడం ఏమో కానీ లేని సమస్య తెచ్చుకున్నట్లు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్ వల్ల మూత్రపిండాలతో పాటు లివర్ ఆరోగ్యాన్ని కూడా దెబ్బ తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
కిడ్నీల్లో రాళ్ల సమస్య రాకుండా ఉండాలంటే తగినంత నీరు తీసుకోవడం ఒక్కటే ఏకైక మార్గమని వైద్యులు చెబుతున్నారు. అదనపు ఉప్పు, టమాట వంటివి ఎక్కువ తినడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కిడ్నీలో రాళ్లు తొలగించడానికి ఆల్కహాల్ ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి నిజం లేదని తేల్చి చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..