Obesity: ఇండియాలో ఊబకాయం కేసులు పెరిగిపోతున్నాయ్.. ఆందోళనకరంగా నివేదికలోని అంశాలు

భారతదేశంలో ఊబకాయం కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. 2030 నాటికి దేశంలో ఊబకాయంతో బాధపడే పిల్లల సంఖ్య 27 మిలియన్లు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక ప్రకారం 1.38 బిలియన్లకు పైగా జనాభా ఉన్న....

Obesity: ఇండియాలో ఊబకాయం కేసులు పెరిగిపోతున్నాయ్.. ఆందోళనకరంగా నివేదికలోని అంశాలు
Obesity

Updated on: Jul 08, 2022 | 7:14 AM

భారతదేశంలో ఊబకాయం కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. 2030 నాటికి దేశంలో ఊబకాయంతో బాధపడే పిల్లల సంఖ్య 27 మిలియన్లు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక ప్రకారం 1.38 బిలియన్లకు పైగా జనాభా ఉన్న భారతదేశంలో ఊబకాయం ఉన్న పెద్దల సంఖ్య 2012లో 25.2 మిలియన్ల నుంచి 2016లో 34.3 మిలియన్లకు పెరిగింది. వయోజన జనాభాలో 2012లో 3.1శాతం ఉన్న సమస్యలు 2016 నాటికి 3.9 శాతానికి ఎగబాకింది. వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ కూడా భారతదేశంలో 2030 నాటికి 27 మిలియన్ల మంది పిల్లలు ఊబకాయంతో బాధపడతారని అంచనా వేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)తో కలిసి పని చేసే ఫెడరేషన్ నివేదిక ప్రకారం, దేశంలో ప్రతి 10 మంది పిల్లల్లో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారని వెల్లడించింది. ఊబకాయం ద్వారా అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఇది గుండె సమస్యలు, డయాబెటిస్ కు దారి తీసే అవకాశముంది.

ఫరీదాబాద్‌లోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హాస్పిటల్ డైరెక్టర్ జనరల్ సర్జరీ డాక్టర్ బ్రహ్మ్ దత్ పాఠక్ మాట్లాడుతూ.. జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు మారిపోయాయి. బయటి ఆహారానికి అలవాటుపడిపోయాం. దీనికి సాంకేతికత తోడవడంతో ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్లకు డిమాండ్ పెరిగింది. ఏ పని చేయకుండా ఫుడ్ నోటికొచ్చేసరికి వ్యాయామం చేసేందుకు సమయం ఉండటం లేదు. దీంతో ఊబకాయం సమస్య పెరిగిపోతోంది. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం అమెరికా ఎదుర్కొన్న సమస్యను ప్రస్తుతం ఇండియా ఎదుర్కొంటుందని హెచ్చరించారు. ప్రొటీన్ ఫుడ్ తీసుకోకుండా కార్బోహైడ్రేట్లను అధికంగా తీసుకోవడం ద్వారా ఊబకాయం సమస్య మరింత తీవ్రమవుతుందని ఆయన చెప్పారు.

ఊబకాయం బారిన పడకుండా ఉండాలంటే కచ్చితంగా వ్యాయామం చేయాల్సిందేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే పనిగా కూర్చోవడం కంటే మధ్యమధ్యలో 10 నిమిషాలు నడవాలని సూచిస్తున్నారు. మనం ఎంత కేలరీలు తింటున్నాము. ఎంత కేలరీలను వినియోగిస్తున్నామనే విషయాన్ని బేరీజా వేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఊబకాయం సమస్య నుంచి రక్షించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నోట్.. ఇందులో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.. వీటిని పాటించే ముందు నిపుణుల సూచనలు తీసుకోవడం మంచిది.