AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‌Health Tips: రోగనిరోధక శక్తి పెరగాలంటే దీనిని తినాల్సిందే.. పోషకాలతోపాటు విటమిన్లకు కేరాఫ్ అడ్రస్ ఈ కూరగాయ..!

Spiny Gourd: బోడ కాకరకాయ విటమిన్లు, పోషకాలతో కూడిన ఒక దివ్యౌషధం. దీని కారణంగా, శరీరానికి విటమిన్లు B-12, C, D, జింక్ వంటి పోషకాలు అందుతాయి. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.

‌Health Tips: రోగనిరోధక శక్తి పెరగాలంటే దీనిని తినాల్సిందే.. పోషకాలతోపాటు విటమిన్లకు కేరాఫ్ అడ్రస్ ఈ కూరగాయ..!
Spiny Gourd
Venkata Chari
|

Updated on: Jan 06, 2022 | 9:43 AM

Share

Spiny Gourd Benefits: కరోనా కాలంలో, మీరు మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. శరీరం దృఢంగా ఉండాలంటే విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. ముఖ్యంగా చలి కాలంలో జలుబు, దగ్గు, జలుబు నుంచి మిమ్మల్ని రక్షించడానికి మీ రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం, పోషకాలు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను మీ ఆహారంలో భాగంగా చేసుకోండి. దీంతో మీరు అవసరమైన విటమిన్లతోపాటు ఖనిజాలను పొందే అవకాశం ఉంది. శరీరానికి అవసరమైన అన్ని విటమిన్‌లను అందించే ప్రత్యేకమైన కూరగాయల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాటిలో ముఖ్యమైనది అడవి కాకర. దీనిని ఆగాకర లేదా బోడకాకర కాయ అంటూ పలు రకాలుగా పిలుస్తుంటారు. ఇది మీ శరీరాన్ని బలంగా చేస్తుంది. ఇది ఓ ఔషధంలాను పనిచేస్తుంది. దీనిని కంటోలా లేదా వాన్ బిట్టర్ గోర్డ్ అని కూడా పిలుస్తుంటారు. ఇందులో విటమిన్ బి12, విటమిన్ డి, కాల్షియం, జింక్, కాపర్, మెగ్నీషియం వంటి అన్ని పోషకాలు ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది.

బోడకాకర కాయలో పోషకాలు.. బోడకాకర కాయలో ఒకటి రెండు కాదు ఎన్నో పోషకాలు ఉంటాయి. ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, విటమిన్ B1, B2, B3, B5, B6, B9, B12, విటమిన్ A, విటమిన్ C, విటమిన్ D2, 3, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, విటమిన్ H, విటమిన్ K, కాపర్, జింక్ ఉంటాయి. అందుకే ఇది చాలా ప్రత్యేకమైన కూరగాయగా పరిగణిస్తారు. ఈ కూరగాయలలో శరీరాన్ని దృఢంగా మార్చే అన్ని విటమిన్లు ఉంటాయి.

ఈ వ్యాధులకు బోడకాకరతో చెక్ పెట్టొచ్చు.. ఆగాకర మిమ్మల్ని అనేక వ్యాధుల నుంచి కూడా రక్షిస్తుంది. ఆయుర్వేదంలో కూడా అడవికాకరకు చాలా ప్రాముఖ్యత ఉంది. 1- ఆగాకర తినడం వల్ల రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. జలుబు, దగ్గు, జలుబు వంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది. 2- తలనొప్పి, జుట్టు రాలడం, చెవి నొప్పి, దగ్గు, కడుపులో ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది. 3- పైల్స్, జాండిస్ వంటి వ్యాధులు కూడా తొలగిపోతాయి. 4- దీన్ని తినడం వల్ల మధుమేహ రోగులకు కూడా చాలా మేలు చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. 5- వర్షాకాలంలో వర్చే దురదల నుంచి కూడా కాపాడుతుంది. 6- పక్షవాతం, వాపు, అపస్మారక స్థితి, కంటి సమస్యల విషయంలో కూడా మంచి ప్రభావం చూపిస్తుంది. 7- జ్వరం వచ్చినప్పుడు కూడా మీరు దీనిని తినవచ్చు. 8- రక్తపోటు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షించడంలో కూడా ఇది సహాయపడుతుంది.

Also Read: Hair Care Tips: వింటర్ సీజన్‌లో జుట్టు సంరక్షణకు ఈ హోమ్‌మేడ్‌ చిట్కాలను ఇలా ట్రై చేయండి..

Omicron vs Normal Cold: సాధారణ జలుబు, ఒమిక్రాన్ మధ్య తేడా ఇదే.. లక్షణాలను గుర్తించండి ఇలా