Health Tips: చెడు కొలస్ట్రాల్‌ని తగ్గించాలంటే ఈ 4 డ్రై ఫ్రూట్స్ డైట్‌లో ఉండాల్సిందే..!

Health Tips: మారిన జీవన విధానం, చెడు ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది అనారోగ్యం బారినపడుతున్నారు. మీరు తీసుకునే ఆహారం నేరుగా మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

Health Tips: చెడు కొలస్ట్రాల్‌ని తగ్గించాలంటే ఈ 4 డ్రై ఫ్రూట్స్ డైట్‌లో ఉండాల్సిందే..!
Dry Fruits
Follow us
uppula Raju

|

Updated on: Apr 10, 2022 | 8:13 PM

Health Tips: మారిన జీవన విధానం, చెడు ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది అనారోగ్యం బారినపడుతున్నారు. మీరు తీసుకునే ఆహారం నేరుగా మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే ఈ విషయంలో జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. జంక్‌ఫుడ్‌ ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కొలస్ట్రాల్ పెరుగుతుంది. దీనివల్ల చిన్నవయసులో గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. అందుకే కొలస్ట్రాల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజానికి శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి. మొదటిది మంచి కొలస్ట్రాల్‌, రెండోది చెడు కొలస్ట్రాల్. ఒకవేళ మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం ప్రారంభిస్తే గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ పరిస్థితిలో మీ కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ సమయంలో కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్‌ తినడం వల్ల పెరిగిన కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు.

1. వాల్ నట్స్

వాల్‌నట్‌లు పెరిగిన కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి. ఇవి మీ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి పనిచేస్తాయి. వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, మోనోశాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.

2. బాదం పప్పు

ఫిట్‌గా ఉండాలంటే రోజూ బాదంపప్పులు తినాలని తరచూ వైద్యులు సూచిస్తారు. బాదంపప్పులో అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌ను తయారు చేస్తాయి. బాదంపప్పును రోజూ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ త్వరగా తగ్గుతుంది.

3. పిస్తాపప్పు

మీరు రోజూ పిస్తాపప్పులు తినాలి. దీనివల్ల మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

4. ఖర్జూర

ఖర్జూరలో కావల్సినన్ని పోషకాలు ఉన్నాయి. ఇందులో ఉండే పోషకాలు మంచి కొలస్ట్రాల్‌ని పెంచి చెడు కొలస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. ఖర్జూరలో 6 రకాల విటమిన్లు, 15 రకాల ఖనిజాలూ ఉంటాయి. రోజుకి రెండు మూడు ఖర్జూరాలు తీసుకుంటే శరీరానికి బోలెడంత శక్తి లభిస్తుంది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Cucumber: వేసవిలో దోసకాయ సూప్ ట్రై చేయండి.. పిల్లలు బాగా ఇష్టపడుతారు..!

IPL 2022: ధోని ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడా.. ఈ మాజీ ప్లేయర్ ఏం చెబుతున్నాడంటే..?

Viral Video: డీజె ఎఫెక్ట్‌.. స్టేజ్‌పైనే డ్యాన్స్ చేసిన పెళ్లికూతురు.. బిత్తరపోయిన పెళ్లికొడుకు..!