Research: నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.? అయితే మీకు ఈ వ్యాధి తప్పదు.. పరిశోధనల్లో షాకింగ్ విషయాలు..
Research: మారుతోన్న జీవన విధానం (Life Style), వృత్తి జీవితం కారణం ఏదైనా నిద్రలేమి ఇటీవల పెద్ద సమస్యగా మారిపోయింది. వేళాపాల లేని డ్యూటీలు, పని ఒత్తిడి, షిప్టుల్లో పని చేయడం ఇలా ప్రతీ అంశం నిద్రపై ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా...
Research: మారుతోన్న జీవన విధానం (Life Style), వృత్తి జీవితం కారణం ఏదైనా నిద్రలేమి ఇటీవల పెద్ద సమస్యగా మారిపోయింది. వేళాపాల లేని డ్యూటీలు, పని ఒత్తిడి, షిప్టుల్లో పని చేయడం ఇలా ప్రతీ అంశం నిద్రపై ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా సోషల్ మీడియా (Social Media), స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం పెరగడంతో చాలా మంది పేరుకు నిద్రకు ఉపక్రమించినా గంటల కొద్ది ఫోన్‌లతో గడిపేస్తున్నారు. దీంతో సరిపడ నిద్ర లేక అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారు. నిద్రలేమి కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఉన్నాయని తెలిసినా చాలా మంది నిద్రను నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు.
సరిపడ నిద్రలేకపోవడంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయని వైద్యులు సూచిస్తున్నారు. అయితే నిద్రలేమితో టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధకులు చేసిన తాజా అధ్యయనంలో తేలింది. రాత్రుళ్లు ఆలస్యంగా పడుకునే అలవాటు ఉన్న వారిలో చక్కెర స్థాయిలు ఎక్కువగా చేరుతున్నాయని పరిశోధకులు తెలిపారు. అధ్యయనంలోనే భాగంగా యూకేలో ఏకంగా 3,36,999ని పరిగణలోకి తీసుకున్నారు.
వీరిపై పరిశోధనలు నిర్వహించిన అనంతరం ఈ విషయాన్ని తెలిపారు. నిద్రలేమి కారణంగా అధిక బ్లడ్ షుగర్ లెవల్స్‌కు కారణవుతుందని, ఇది మనిషి శరీరంలో టైప్ 2 డయాబెటిస్‌ను వృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని గుర్తించారు. మధుమేహ సమస్య దరిచేరకుండా ఉండాలంటే నిద్రను నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: Viral Video: మహిళకు సాయం చేసిన వ్యక్తి అనంతరం కిందపడిన వ్యక్తి నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
India-US 2+2 Meet: రేపు భారత్ – అమెరికా మధ్య 2+2 భేటీ.. రష్యా, చైనా అంశాలపైనే ప్రధాన చర్చ!