Holy Water: ఆ ఆలయంలో బిందె నీళ్లు రూ.1.30 లక్షలు.. ఈ నీటితో స్నానం చేస్తే..సంతానం కలుగుతుందని నమ్మకం.. ఎక్కడంటే
Holy Water: కొందరు దీనిని మూఢనమ్మకం అని అంటారు. కొందరు దీనిని వ్యాపార అవకాశంగా భావించవచ్చు, ఇక్కడ ముక్తేశ్వర ఆలయం(Mukteswar Temple)లో ఉన్న ప్రసిద్ధ మరీచి 'కుండ' (చెరువు)(Maricha Kunda) నుండి..
Holy Water: కొందరు దీనిని మూఢనమ్మకం అని అంటారు. కొందరు దీనిని వ్యాపార అవకాశంగా భావించవచ్చు, ఇక్కడ ముక్తేశ్వర ఆలయం(Mukteswar Temple)లో ఉన్న ప్రసిద్ధ మరీచి ‘కుండ’ (చెరువు)(Maricha Kunda) నుండి తీసిన పవిత్ర జలం మొదటి బిందె వేలంలో ₹ 1.30 లక్షలు పలికింది. ఇక్కడ లింగరాజు వార్షిక రుకున రథ ఉత్సవాల ముందురోజు ఇలా పవిత్ర జలాన్ని వేలం వేయడం ఆనవాయితీ. మరిచి కుంట సమీపంలో శుక్రవారం రాత్రి పవిత్ర జలాల వేలం నిర్వహించారు. పవిత్ర జలంలో స్నానం చేయడం వల్ల భక్తులలో సంతానోత్పత్తి సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. వివరాల్లోకి వెళ్తే..
ఒడిశా భువనేశ్వర్‌లోని ముక్తేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉన్న మరీచి గుండంలోని బిందె నీటిని రూ.1.30 లక్షలకు విక్రయించారు. లింగరాజస్వామి రుకుణ యాత్రలో భాగంగా ఏటా అశోక అష్టమి ముందు రోజు రాత్రి మరీచి గుండంలోని నీటిని విక్రయించేందుకు వేలం నిర్వహిస్తారు. లింగరాజ ఆలయంలో ఉండే బడునియోగ్ వర్గానికి చెందిన సేవాయత్‌లు ఈ ప్రక్రియ చేపడతారు. శుక్రవారం రాత్రి వేలంపాట జరగగా.. తొలి బిందె నీటి ధర రూ.25 వేలతో ప్రారంభమైంది. ఆ బిందెను భువనేశ్వర్‌లోని బారాముండా ప్రాంతానికి చెందిన దంపతులు రూ.1.30 లక్షలకు కొనుక్కున్నారు. రెండో బిందెను రూ.47 వేలు, మూడోదాన్ని 13 వేలకు భక్తులు దక్కించుకున్నారు. మిగిలిన నీటిని పేద దంపతులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ నీటితో స్నానంచేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ గుండం చుట్టుపక్కల ఉన్న అశోక చెట్ల వేర్ల ప్రభావంతో ఆ నీటిలో ఔషధ గుణాలుంటాయని స్థానికులు చెబుతారు. 2019లో జరిగిన వేలంలో బిందెడు నీటిని రూ.2.50 లక్షలకు కొన్నారు.
Also Read: Sri Ramanavami: ఘనంగా మొదలైన ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలు.. సాయంత్రం శేషవాహనం సేవ
Hindu Temple: ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడ ఉంది..? నిర్మించడానికి పట్టిన సమయం 30 ఏళ్లు..!