AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Ramanavami: ఘనంగా మొదలైన ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలు.. సాయంత్రం శేషవాహనం సేవ

Sri Ramanavami: కడప జిల్లా(Kadapa Distrcit) ఒంటిమిట్ట(Vontimitta)లో శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శనివారం సాయంత్రం బ్రహ్మోత్సవా(Brahmotsavam)లకు అంకురార్పణ..

Sri Ramanavami: ఘనంగా మొదలైన ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలు.. సాయంత్రం శేషవాహనం సేవ
Vontimitta Sri Kodandarama
Surya Kala
|

Updated on: Apr 10, 2022 | 9:48 AM

Share

Sri Ramanavami: కడప జిల్లా(Kadapa Distrcit) ఒంటిమిట్ట(Vontimitta)లో శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శనివారం సాయంత్రం బ్రహ్మోత్సవా(Brahmotsavam)లకు అంకురార్పణ చేశారు. ఈరోజు ఉదయం అంగరంగవైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. వేద పండితుల మత్రోచ్చరణల నడుమ వైభవోపేతంగా ఈ వేడుక సాగింది. కేరళా వాయిద్యాలతో ఆలయ ప్రాంగణం హోరెత్తింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి.

సాయంత్రం స్వామివారు శేషవాహనం పై ఊరేగనున్నారు. ఈరోజు శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా జరుపనున్నారు. సీతారాముల ఉత్సవమూర్తులను సర్వాంగసుందరంగా అలంకరించారు అర్చకస్వాములు. రాత్రి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి విష్వక్సేన పూజ, కలశ ప్రతిష్ట, కలశపూజ నిర్వహించారు.. సీతా, రామ, లక్ష్మణ స్వామివార్లకు కంకణధారణ చేసి పుట్టమట్టిని సేకరించి అంకురార్పణ చేసారు.

ఈనెల 19వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేశారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే నిర్వహించిన విషయం తెలిసిందే. కోవిడ్ వ్యాప్తి అదుపులోకి రావడంతో ఈ ఏడాది ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఇక ఈ నెల 15న పున్నమి వెన్నెలలో సీతారాముల కల్యాణ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పౌర్ణమి రోజు రాత్రి 8 గంటల నుంచి 10 గంటలలోపు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. సీతారాములకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు సీఎం జగన్‌.

ఇప్పటికే ఒంటిమిట్ట కోదండ రామ స్వామివారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, డిప్యూటి ఈవో రమణ ప్రసాద్ ఆహ్వానించారు.

Also Read: Srirama Navami: శ్రీరామనవమికి ముస్తాబైన భద్రాద్రి.. రెండేళ్ల తర్వాత భక్తుల నడుమ రాములోరి కళ్యాణం.. పోటెత్తిన భక్తులు