Sri Rama Navami: మరికాసేపట్లో సీతారాముల కల్యాణం.. ఇల వైకుంఠాన్ని తలపిస్తున్న భద్రాద్రి
Sri Rama Navami: భద్రాద్రి(Bhadradri) రాములోరి కల్యాణానికి అంగరంగ వైభంగా ముస్తాబైంది. శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మిథిలా స్టేడియం(Mithila stadium)లో మూలమూర్తులకు..
Sri Rama Navami: భద్రాద్రి(Bhadradri) రాములోరి కల్యాణానికి అంగరంగ వైభంగా ముస్తాబైంది. శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మిథిలా స్టేడియం(Mithila stadium)లో మూలమూర్తులకు సీతారాముల కళ్యాణం నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటలకు ఆలయం నుంచి స్వామి వారి ఉత్సవమూర్తులను మిథిలాస్టేడియంలోని కల్యాణ మండపానికి ఊరేగింపుగా తరలించారు. 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు రామయ్య కల్యాణం జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు…పునర్వసు నక్షత్రం, అభిజిత్ లగ్న సముహూర్తంలో సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. సీతారాముల కల్యాణానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. తెలుగురాష్ట్రాలలో పాటు, ఛత్తీస్ గడ్, ఒడిశా, తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు హాజరవుతారు. రెండేళ్ల తర్వాత భక్తుల నడుమ రామయ్య సీతమ్మను వివాహం చేసుకోనున్నారు. పట్టణంలో రామాలయం పరిసరాలు, గోదావరి స్నానఘట్టాలు, కరకట్ట ఎక్కడ చూసినా భక్తుల సందడి కనిపిస్తోంది.
Also
Also Read: