IPL 2022: ధోని ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడా.. ఈ మాజీ ప్లేయర్ ఏం చెబుతున్నాడంటే..?
IPL 2022: ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్ దారుణమైన స్థితిలో ఉంది. నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. నాలుగు సార్లు
IPL 2022: ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్ దారుణమైన స్థితిలో ఉంది. నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ తొమ్మిది సార్లు ఫైనల్‌కు చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జట్టు ప్రదర్శన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ గాయపడటం జట్టు కష్టాలను మరింత పెంచింది. అయితే సమస్య బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ ఉంది. CSK టాప్ ఆర్డర్‌లో మార్పు రావాలని మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ సూచించాడు. అందుకోసం మహేంద్ర సింగ్ ధోని ఓపెనింగ్ లేదా మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వెళ్లాలని చెప్పాడు. ఎందుకంటే ధోని కఠినమైన పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయగలడు. భారీ స్కోరు చేయగలడని వివరించాడు.
గతంలో CSK తరపున ఆడిన పార్థివ్ పటేల్ ట్వీట్ చేస్తూ “ఓపెనర్‌గా ధోని ఆడాలి. అతను కఠినమైన పరిస్థితులలో బ్యాటింగ్ చేయగలడు. ఆ తర్వాత భారీ పరుగులు చేయగలడు. ధోనిని ఓపెనర్‌గా ప్రయత్నించడానికి CSKకి ఇంతకంటే మంచి సమయం ఉండదు. ధోని కెరీర్ చివరి దశలో ఉన్నాడు. కాబట్టి ఓపెనర్‌గా ఎందుకు ప్రయత్నించకూడదు. అతను ప్రస్తుతం ఏడో స్థానంలో ఆడుతున్నాడు. చివరలో10 నుంచి 15 బంతులు ఆడలేడు. ఈ పరిస్థితిలో ఓపెనింగ్ లేదా 3 స్థానంలో వస్తే జట్టుకి మంచి జరుగుతుంది’ అని చెప్పాడు.
ధోని ఓపెనింగ్‌కు అనుకూలంగా వాదించిన పార్థివ్ పటేల్.. ధోనీ టెక్నిక్ గురించి వివరించాడు. సీమింగ్ వికెట్‌పై భారత్ కష్టాల్లో పడినప్పుడల్లా ధోనీ మంచి ఆటతీరు కనబరిచాడని గుర్తు చేశాడు. ధర్మశాలలో శ్రీలంకపై 80 పరుగులు చేసినా, చెన్నైలో పాకిస్థాన్‌పై 70 పరుగులకే ఐదు వికెట్లు పడిపోయిన తర్వాత సెంచరీ చేసినా అది ధోనికే చెల్లిందన్నాడు. ఏ పరిస్థితిలో ఎలా ఆడాలనేది ధోనికి తెలిసినంతగా మరెవరికి తెలియదని చెప్పుకొచ్చాడు.
Dhoni’s technique may not be copy book for an opener but he has his own methods how to survive in tough conditions and then score heavily. Perhaps no better time than now for #CSK to try out #Dhoni as an opener? What you think? #IPL2022 https://t.co/vqciVKfrUx
— parthiv patel (@parthiv9) April 10, 2022