Cucumber: వేసవిలో దోసకాయ సూప్ ట్రై చేయండి.. పిల్లలు బాగా ఇష్టపడుతారు..!
Cucumber: మండుతున్న ఎండలలో ప్రజలు నీరసంతో అలసిపోతారు. ఈ పరిస్థితిలో హైడ్రేట్‌గా ఉండటానికి నీరు అధికంగా ఉండే ఆహారాలను తీసుకుంటే మంచిది. ఇందులో
Cucumber: మండుతున్న ఎండలలో ప్రజలు నీరసంతో అలసిపోతారు. ఈ పరిస్థితిలో హైడ్రేట్‌గా ఉండటానికి నీరు అధికంగా ఉండే ఆహారాలను తీసుకుంటే మంచిది. ఇందులో దోసకాయ, పుచ్చకాయ వంటి అనేక రకాల ఆహారాలు ఉన్నాయి. వీటిని తినడం ద్వారా అద్భుత శక్తిని పొందుతాం. అవి మన రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా అలసటను తొలగించడానికి పని చేస్తాయి. వేసవిలో దోసకాయను సూప్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇది మిమ్మల్ని చల్లబరుస్తుంది. ఈ సూప్ తయారు చేయడం కూడా చాలా సులభం. ఇది చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు ఈ సూప్‌ను బాగా ఇష్టపడతారు. దీన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
దోసకాయ ముక్కలు, వెల్లుల్లి, 2 లవంగాలు, 1/4 కప్పు పుదీనా ఆకులు, 1 కప్పు పెరుగు, 1/2 కప్పు పాలు, 1 కప్పు తరిగిన పచ్చి మిర్చి, 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె, రుచికి సరిపడ ఉప్పు, సరిపడ నల్ల మిరియాలు
దోసకాయ సూప్ ఎలా తయారు చేయాలి..?
ఈ సూప్ తయారు చేయడానికి ముందుగా దోసకాయను ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత వెల్లుల్లి మొగ్గలను కట్ చేయాలి. ముందుగా దోసకాయ ముక్కలను గ్లైండర్‌లో వేసి పేస్టులా చేయాలి. తరువాత అదే గ్లైండర్‌లో వెల్లుల్లి, 1/4 కప్పు పుదీనా, పచ్చిమిర్చి, చిక్కటి పెరుగు, 1/2 కప్పు పాలు వేయాలి. తరువాత రుచి ప్రకారం 2 టీస్పూన్ల ఆలివ్ నూనె, ఉప్పు, మిరియాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని గ్లైండర్ నుంచి నేరుగా గిన్నెలో పోసి ఈ సూప్‌ని జల్లెడ పట్టాలి. తాగడానికి ముందు ఒక గంట లేదా రెండు గంటలు ఫ్రిజ్‌లో ఉంచాలి. అంతే దోసకాయ సూప్ రెడీ అయినట్లే.
దోసకాయ ఆరోగ్య ప్రయోజనాలు
దోసకాయలో విటమిన్లు సి, కె, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్లు, ఫాస్పరస్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది చాలా తక్కువ మొత్తంలో కేలరీలను కలిగి ఉంటుంది. ఇది బరువు తగ్గించడంలో దోహదం చేస్తుంది. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. వేసవిలో శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుతుంది. ఇది కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.