మెడ నొప్పి తీవ్రంగా ఉండా సర్వికల్ స్పాండిలోసిస్ కావచ్చు…ఈ వ్యాధికి ఆయుర్వేద పరిష్కారాలు ఇవే..

నిద్రలో ఒక్కోసారి మెడ నొప్పి కలగడం సహజమే. అయితే చాలామందిలో మెడ కండరాలు పట్టేయడం గమనిస్తూ ఉంటాము ఒక్కోసారి కి సర్వికల్ స్పాండిలైటిస్ అనే వ్యాధికి కూడా దారి తీయవచ్చు.

మెడ నొప్పి తీవ్రంగా ఉండా సర్వికల్ స్పాండిలోసిస్ కావచ్చు...ఈ వ్యాధికి ఆయుర్వేద పరిష్కారాలు ఇవే..
Neck Muscle Cramps

Edited By:

Updated on: Apr 28, 2023 | 8:41 AM

నిద్రలో ఒక్కోసారి మెడ నొప్పి కలగడం సహజమే. అయితే చాలామందిలో మెడ కండరాలు పట్టేయడం గమనిస్తూ ఉంటాము ఒక్కోసారి కి సర్వికల్ స్పాండిలైటిస్ అనే వ్యాధికి కూడా దారి తీయవచ్చు. ఎన్ని మందులు వాడినప్పటికీ, ఈ సర్వీస్ స్పాండిలోసిస్ వ్యాధికి ప్రభావం చూపకపోవచ్చు ఫలితంగా మెడకు కాలర్ పెట్టుకొని చాలామంది తిరగటం మనం గమనించే ఉంటాము. కంప్యూటర్‌పై ఎక్కువ గంటలు కూర్చోవడం, ఆఫీసులో పనిచేసే ఉద్యోగులు, లేవడం, కూర్చోవడం వంటి తప్పుడు మార్గాల వల్ల వెన్నుపాము గుండా వెళ్లే నరాలపై ఒత్తిడి పడుతుంది.

సర్వైకల్ స్పాండిలోసిస్ కారణంగా చేతులు కాళ్ళలో జలదరింపు, తలనొప్పి, మెడ నొప్పి , వెర్టిగో రూపంలో కనిపిస్తుంది. ముఖ్యంగా కీళ్ళనొప్పులు పెరగడం వల్ల రోగులు ఇబ్బంది పడుతున్నారు. పంచకర్మ చికిత్స తర్వాత, రోగులలో వ్యాధి ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అంతే కాదు సర్వికల్ స్పాండిలోసిస్ కు ఆయుర్వేదంలోనూ యోగాలోనూ చక్కటి పరిష్కారాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మెడనొప్పికి ఆయుర్వేదంలో పరిష్కారాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం:

ఇవి కూడా చదవండి

– కొబ్బరి నూనెలో మూడు చుక్కలు పుదీనా తైలం కలిపి మర్దన చేయడం ద్వారా మెడ నొప్పి తగ్గిపోయే అవకాశం ఉంది.

– ఆవనూనెలో కర్పూరం కలిపి రాయడం ద్వారా కూడా మెడ నొప్పి నెమ్మదిగా తగ్గిపోయే అవకాశం ఉంది.

-మునగ ఆకును పెనం మీద కొద్దిగా కాల్చి ఆ వెచ్చటి ఆకులను నొప్పి ఉన్న ప్రదేశంలో ఉంచి గట్టిగా అదుముకొని, గుడ్డతో పట్టి కట్టుకుంటే నెమ్మదిగా నొప్పి తగ్గిపోతుంది.

-అదేవిధంగా మెడ నొప్పికి గోరు వెచ్చటి నీటిలో, జామాయిల్ ఆకులు వేసి మరిగించి ఆ నీటితో స్నానం చేయడం ద్వారా మెడనొప్పి నుంచి కాస్త ఉపశమనం పొందే వీడు ఉంది.

మెడ నొప్పికి యోగాసనాల్లో పరిష్కారం:

– సర్వికల్ స్పాండిలోసిస్ ద్వారా వచ్చిన మెడ నొప్పికి యోగాలో మంచి చికిత్సలు ఉన్నాయి అనేక ఆసనాలు ఈ వ్యాధి నుంచి మిమ్మల్ని కాపాడుతాయి. శవాసనం వేయడం ద్వారా శరీరం రిలాక్స్ అయి మెడ నొప్పి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా సూర్య నమస్కారాలు కూడా మీ మెడ నొప్పిని తగ్గించడంలో చాలా ఉపయోగపడతాయి.

– భుజాంగాసనం, ధనురాసనం, మర్జార్యాసనం, సేతు బంధాసనం, మత్స్యాసనం వేయడం ద్వారా మీరు మెడ నొప్పికి పరిష్కారం కనుగొనవచ్చు. వంటి ఆసనాలను వేయడం ద్వారా సర్వికల్ స్పాండిలోసిస్ వ్యాధి రాకుండా ఉంటుంది.

– అలాగే మీరు కూర్చునే పొజిషన్ కూడా మార్చుకోవడం ద్వారా సర్వికల్ స్పాండిలోసిస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. దీంతోపాటు ఐస్ ప్యాక్ వాడటం ద్వారా మెడనొప్పి నుంచి బయటపడే అవకాశం ఉంది. మెడ నొప్పి ఉన్నప్పుడు, నాటు మసాజ్ జోలికి వెళ్ళకూడదు. కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే జాగ్రత్తగా మీరు పడుకునే పొజిషన్ కూడా చూసుకుంటే ఈ ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం