AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చలికాలంలో మీ కళ్లు జర జాగ్రత్త.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అలర్టవ్వండి..

ఈ చలికాలంలో కళ్లలో అనేక రకాల సమస్యలు వస్తాయి. చలికాలంలో కళ్లు పొడిబారడంతోపాటు చికాకు కూడా రావచ్చు. అటువంటి పరిస్థితిలో, ఈ సీజన్‌లో కంటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ సీజన్‌లో కళ్లకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? వైద్యులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..

చలికాలంలో మీ కళ్లు జర జాగ్రత్త.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అలర్టవ్వండి..
Eye Care
Shaik Madar Saheb
|

Updated on: Dec 13, 2024 | 9:41 AM

Share

చలికాలంలో అనేక కంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ సమయంలో మీకు కళ్లలో నొప్పి, కళ్లు ఎర్రబడడం, నీరు కారడం లేదా తీవ్రమైన నొప్పి వంటి సమస్యలు లాంటివి కనిపిస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేయొద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కొన్ని కంటి జబ్బుల లక్షణం కావచ్చు. లక్షణాలను సకాలంలో గుర్తించడం, చికిత్స చేయడం ద్వారా, ఏదైనా తీవ్రమైన కంటి వ్యాధిని సులభంగా నివారించవచ్చు. శీతాకాలంలో ఏ కంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.. వాటిని ఎలా నివారించాలో నిపుణుల నుంచి తెలుసుకుందాం..

చలికాలంలో అనేక రకాల కంటి జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని ఢిల్లీలోని నానక్ ఐ హాస్పిటల్‌లోని డాక్టర్ అన్నూ కపూర్ చెప్పారు. ఈ సీజన్‌లో కండ్లకలక నుంచి బ్లెఫారిటిస్‌ వంటి కంటి వ్యాధులు రావచ్చు. కండ్లకలక అనేది చలికాలంలో కూడా వచ్చే సాధారణ కంటి వ్యాధి. ఇది వాపు, కళ్లలో నీరు కారడం వంటి లక్షణాలను కలిగిస్తుంది. ఈ వ్యాధిని సమయానికి నియంత్రించడం చాలా ముఖ్యం.. లేకుంటే అది చాలా ఇబ్బందిని కలిగిస్తుంది.

డ్రై ఐ సిండ్రోమ్ ప్రమాదం..

బ్లెఫారిటిస్ గురించి మాట్లాడితే.. ఇది కంటి వ్యాధి, దీనిలో కనురెప్పలు ఉబ్బుతాయి. చలికాలంలో ఇది చాలా సాధారణమైన సమస్య.. అయితే దీనిని పరిష్కరించడం చాలా ముఖ్యం. చలికాలంలో డ్రై ఐ సిండ్రోమ్ వస్తుందని డాక్టర్ అన్నూ చెప్పారు. గాలిలో తేమ లేకపోవడం వల్ల కళ్లు పొడిబారడం జరుగుతుంది. ఇది చికాకు, వాపు మరియు కళ్ళ నుంచి నీరు కారడం వంటి సమస్యలను కలిగిస్తుంది. మీరు ఈ లక్షణాలను గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

ఈ చలికాలంలో తీవ్రమైన కంటి వ్యాధులు కూడా వస్తాయని ఢిల్లీలోని శ్రీ జీవన్ హాస్పిటల్ కంటి విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అంకితా సబర్వాల్ చెబుతున్నారు. రెటీనా డిటాచ్మెంట్ సమస్య కూడా ఉండవచ్చు. ఇది కంటి వ్యాధి, దీనిలో కంటి రెటీనా వేరు చేయబడుతుంది. చలికాలంలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది.

చలికాలంలో కళ్లను ఎలా చూసుకోవాలి..

కంటి సంరక్షణ కోసం డాక్టర్ అంకిత ఈ పద్ధతులను సూచించారు..

ఈ చలికాలంలో మీ కళ్లను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోండి

గోరువెచ్చని నీటితో కళ్ళు శుభ్రం చేసుకోవాలి..

కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా కంటి వ్యాధులను గుర్తించవచ్చు.

డాక్టర్ సలహా మేరకు కంటి చుక్కలు వేయండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి