AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mucus: ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుపోయి ఇబ్బంది పడుతున్నారా..? ఇలా చేయండి

ప్రస్తుతం వాతావరణం చల్లగా ఉండటంతో.. కఫం వల్ల శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి. ఇవి జలుబు, ముక్కు దిబ్బడ, గొంతు ఇబ్బందులు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలకు దారితీస్తాయి. సహజమైన పద్ధతులు ఉపయోగించి, ఈ సమస్యలను సమర్థంగా నివారించవచ్చు. ఆ టిప్స్ ఇప్పుడు తెలుసుకుందాం..

Mucus: ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుపోయి ఇబ్బంది పడుతున్నారా..? ఇలా చేయండి
Lungs
Ram Naramaneni
|

Updated on: May 31, 2025 | 7:49 AM

Share

తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయి. వర్షాలు పడుతున్నాయి. చల్లదనం కారణంగా జనం జలుబు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు గురవుతున్నారు. అంతేకాకుండా చల్లని వాతావరణంలో శరీరం తరచూ శ్వాసకోశ సమస్యలకు గురవుతుంది. వీటిలో ప్రధానంగా కఫం అధికంగా ఏర్పడటం, ముక్కు దిబ్బడ, గొంతు ఇబ్బందులు మొదలైనవి ఉంటాయి. ఇలాంటి సమయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యలను నివారించవచ్చు. సహజమైన పద్ధతుల ద్వారా ఉపిరి తిత్తుల్లో కఫం ఎలా తగ్గించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

కఫాన్ని తగ్గించే ఆహార పదార్థాలు

అల్లం: శ్వాసనాళాల మంటను తగ్గించి కఫం తగ్గించడంలో సహాయపడుతుంది.

పసుపు: యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరంలోని వాపు తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

తేనె: సహజ కఫాన్ని తొలగించే గుణాలు కలిగి ఉంది.

వెల్లుల్లి: శ్వాస మార్గాలను శుభ్రం చేసే శక్తి కలిగిఉంది. సో వీటిని మీ ఆహారంలో భాగం చేసుకుంటే సరిపోతుంది…

తేనె నీటితో చికిత్స

గోరువెచ్చని నీటిలో తేనె, చిటికెడు మిరియాల పొడి, యాలకుల పొడి కలిపి తాగితే శరీరంలోని కఫం పలుచగా మారుతుంది. దీనిని రోజుకు నాలుగైదు సార్లు తీసుకోవడం ద్వారా గొంతు ఇబ్బందులు, ఊపిరితిత్తుల బిగుతు తగ్గుతుంది.

ఆవిరి చికిత్స

ఆవిరిని పీల్చడం ద్వారా శ్వాసనాళాలు తడిగా మారి కఫం బయటికి రావడంలో సులభతరం అవుతుంది. వేడి నీటిలో యూకలిప్టస్ నూనె చుక్కల్ని వేసి ఆవిరిని పీల్చడం మంచి ఫలితాలు అందిస్తుంది.

మూలికల టీలు

పుదీనా, వాము వంటి మూలికలతో చేసిన టీలు కఫం సమస్యలను తగ్గించడంలో తోడ్పడతాయి. ఇవి శ్వాసకోశ మార్గాలను శుభ్రం చేస్తాయి.

శారీరక శ్రమ

రోజువారీ వ్యాయామం, యోగా చేయడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగి కఫం బయటికి పంపడం సులభమవుతుంది. వాకింగ్, డీప్ బ్రీతింగ్ వ్యాయామాలు శ్వాసకోశ ఆరోగ్యానికి చాలా ఉపయుక్తంగా ఉంటాయి.

తరచూ వేడి ద్రవాలను తీసుకోవడం..

తగినంత నీటిని లేదా వేడి ద్రవాలను తాగడం ద్వారా శరీరంలోని కఫం పలుచగా మారి బయటికి వస్తుంది. తేనె, నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీరు కఫ సమస్యలను తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది.

కఫం వల్ల కలిగే సమస్యలను నివారించడానికి సూచనలు

అధిక కొవ్వు, చక్కెర, చల్లని ఆహారాలను తగ్గించండి. శ్వాసకోశ సమస్యలను అరికట్టేందుకు ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామాలు చేయండి. ఇంటిలో తేమ సమతుల్యతను కాపాడుతూ శుభ్రత పాటించండి. ఈ చిట్కాలు పాటించడం ద్వారా కఫం సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహజ పద్ధతులను వినియోగించడం ఉత్తమం.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..