
ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఇడ్లీ అనగానే.. ఇంట్లో అందరికీ నీరసం వచ్చేస్తుంది. ఇడ్లీనా అంటూ కూని రాగాలు మొదలు పెడతారు. ఇడ్లీ తినాలంటే చాలా కష్టం. కానీ ఇడ్లీ ఆరోగ్యానికి చాలా ఆరోగ్యం. ఇడ్లీ తింటే వెంటనే అరిగిపోతుంది. అలాగే ఆకలి కూడా వేస్తుంది. అయినా కూడా ఇడ్లీ ఎవరికీ నచ్చదు. ఇలా ఒక్కొక్క సారి ఇడ్లీలు కూడా మిగిలిపోతాయి. ఇలా మిగిలిపోయిన ఇడ్లీలతో కానీ.. ఫ్రెష్ ఇడ్లీలతో కానీ పులిహోర తయారు చేసుకుని తినవచ్చు. దీంతో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పటివరకూ లెఫ్ట్ ఓవర్ ఇడ్లీలతో స్నాక్స్, ఉప్మా తెలుసుకున్నాం. ఇప్పుడు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా అంటే చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. దేవుడికి నైవేద్యంగా కూడా ఇలా ఇడ్లీ పులిహోరని పెట్టవచ్చు. మరి ఈ రెసిపీకి ఎలా చేయాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
ఇడ్లీలు, నిమ్మకాయ, తాళింపు దినుసులు, జీడి పప్పు, పల్లీలు, అల్లం తరుగు, కరివే పాకు, కొత్తి మీర, నూనె, పచ్చి మిరప కాయలు, ఉప్పు, పసుపు,
ఇడ్లీ పులిహోర తయారీ విధానం:
ముందుగా ఇడ్లీలను పొడి పొడిగా చేసుకోవాలి. తర్వాత కళాయిలో కొద్దిగా నూనె వేసి, వేడి చేసుకోవాలి. నెక్ట్స్ తాళింపు దినుసులు, పల్లీలు, జీడి పప్పు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, పచ్చి మిర్చి వేసుకుని ఒక సారి కలపాలి. పొడి పొడిగా చేసుకున్న ఇడ్లీలను వేసి కలుపుకోవాలి. ఇలా ఓ రెండు నిమిషాలు వేయించుకున్నాక కొత్తి మీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్ట్స్ నిమ్మరసం వేసుకుని కలుపుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ పులిహోర రెడీ. కొత్తగా కావాలి అనుకున్నవారికి చాలా నచ్చుతుంది. టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది. ఇంకెందుకు లేట్.. మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి