Real Vs Fake Almonds: బాదం కొనేటప్పుడు జాగ్రత్త.. ఇలా చెక్ చేసి కొనండి..!
బాదం పప్పులలో కల్తీ పెరుగుతోంది. కూరగాయలు, పండ్లు, సుగంధాలు, మాంసం మాత్రమే కాకుండా ఇప్పుడు బాదంపప్పులూ కల్తీ అవుతున్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి.. కానీ కల్తీ వల్ల ప్రమాదం ఏర్పడుతుంది. నిజమైన బాదంపప్పులు గుర్తించటం కాస్త కష్టం. అయితే కొన్ని సులభమైన పద్ధతుల ద్వారా మనం వాటిని ఈజీగా గుర్తించవచ్చు.

బాదంపప్పులు మధుమేహం, గుండె జబ్బులు, బీపీ వంటి సమస్యల నుండి రక్షణ ఇస్తాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చిన్నపిల్లలకు నానబెట్టిన బాదంపప్పులు ఇవ్వడం వల్ల మంచి శక్తి లభిస్తుంది. అయితే కల్తీ బాదంపప్పులు తింటే ఆరోగ్యానికి హాని కలగొచ్చు. కాబట్టి మార్కెట్ లో తీసుకునే బాదంపప్పులు నిజమైనవా..? నకిలీవా..? అని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నిజమైన బాదంపప్పులు లేత గోధుమ రంగులో ఉంటాయి. అయితే కల్తీ బాదంపప్పులు ఎక్కువగా ముదురు గోధుమ రంగులో ఉంటాయి. ఇది రసాయనాలు కలపడం వల్ల జరుగుతుంది. ముదురు రంగులో ఉన్న బాదం కనిపిస్తే వెంటనే దాన్ని కొనొద్దు.
బాదంపప్పులను నీటిలో వేస్తే నిజమైనవి నీళ్లలో మునిగిపోతాయి. ఎందుకంటే వాటికి బరువు, సాంద్రత సరిగా ఉంటుంది. అయితే కల్తీ బాదంపప్పులు నీటిపై తేలిపోతాయి. ఇది వాటిలో తక్కువ బరువు గల పదార్థాలు కలిపారని చెప్పే సంకేతం.
బాదంపప్పులను చేతుల్లో పెట్టి వేళ్లతో రుద్దాలి. నిజమైన బాదంపప్పులు రుద్దిన తర్వాత చేతిపై ఎలాంటి రంగు ఉండదు. కానీ నకిలీ బాదంపప్పులు రుద్దితే రంగు చెయ్యి మీద పడుతుంది. ఇలా రంగు మారితే అది నకిలీ అనుకోవచ్చు.
బాదంపప్పులను తెల్ల కాగితంపై ఉంచి బాగా నొక్కాలి. నిజమైన బాదంపప్పుల వాసన లేదా కొవ్వు బయట పడుతుంది. కానీ నకిలీ బాదంపప్పులు అలా నొక్కినా ఏ గంధమూ, నూనెను చూసే అవకాశం ఉండదు. ఇది కూడా మనకు సహాయం చేస్తుంది గుర్తించడానికి.
బాదంపప్పులు అసలైనవో, నకిలీవో గుర్తించడానికి ఇంకో సులభమైన పద్ధతి ఉంది. ఒక తెల్ల కాగితంపై కొన్ని బాదంపప్పులను ఉంచి గట్టిగా నొక్కండి. అసలైన బాదంపప్పులు అయితే వాటి నుంచి స్పష్టమైన బాదం వాసన వస్తుంది. అలానే కాగితంపై నూనె మరక కనిపిస్తుంది. నకిలీ బాదంపప్పులు అయితే ఎంత నొక్కినా ఎటువంటి వాసన రాదు.. నూనె కూడా బయట పడదు.
దుకాణంలో బాదంపప్పులు కొనేటప్పుడు ఒకసారి రుచి చూడండి. నిజమైన బాదంపప్పులు రుచికి తియ్యగా, తినడానికి మృదువుగా ఉంటాయి. కల్తీ బాదంపప్పులు చేదుగా ఉండవచ్చు లేదా వాటికి వింత రుచి, వాసన వస్తాయి. ఈ రుచి, వాసనల ద్వారా బాదంపప్పులు కల్తీ అయినవో కాదో సులువుగా గుర్తించవచ్చు.
నిజమైన బాదంపప్పులను ఎంచుకోవడం ద్వారా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. చిన్న మార్గాల ద్వారా కూడా కల్తీని తెలుసుకోవచ్చు. మార్కెట్లో ఉండే అన్ని పదార్థాలు నిజమైనవే అనుకోవడం సరైంది కాదు. అందుకే కొనుగోలు చేసే ముందు పై సూచనలు గుర్తుపెట్టుకోండి.
